పుట:2015.396258.Vyasavali.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

రాజరాజు కొలమందున్న తెనుగుభాష89 రాజరాజు నాటి తెలుగుభాష రానురాను మారి నన్నయభట్టు కెనా బోధపడనట్టిది నేటి వ్యవహారమందున్న ది. ఆకాలపు లిపికూడా భాష వలే నే క్రమేణ మారిపోయినది. ఎవరికో మిక్కిలిశ్రమపడి నేర్చుకొన్న వారికితప్ప నేటిపండితుల కై నా నోటిలిపి తెలియదు. ప్రొసినఅక్షరము వాడుక లో కంటికి కనబడుతూ ఉన్నట్టుఉండక ఏమాత్రము వ్యత్య సమైనా పోల్చుకొనుటకు సాధ్యము కాదు. అట్లే భాషలోని శబ్దములలో ఒక వర్ణము లోపించినా ఒక వర్ణము అధికమయినా ఒక వర్ణము (అచ్చు గాని హల్లుగాన్ని మారిపోయినా ఆ శబ్దములు నిరర్ధక ములవుతవి, చూడగానే తెలిసేటట్టు వ్రాసిన అక్షరములున్ను, వినగానే తెలిసేటట్టు ఆడిన మాట లున్ను, మనుష్యులు తమ మమోభావవరులు ఒకరికొకరు తెలియబర్చుటకు సాధనముగా లోకములో పోడుకొంటారు. దేశ భాష అనేది అట్టసాధ నమే. అనేక కారణముల చేత ఈ సాధనము మారడము సౌజమే. రాజు రాజు కాలమందు వాడుకలో ఉండిన ఈ భాషారూపమైన సాధనము ఎటు వంటిదో నిరూపించుటకు అప్పుడు వ్రాసిన వ్రాతలతప్ప వేరేఆధారము లేదు. తెలుగుభాషనుగురించి ఆనుషంగిక మైన విషయము ఒకటి విచా రించవలసినది ఉన్నది. నేటి తెనుగుపండితులు లౌకిక వ్యవహారమందు లోక ముతోపాటు వ్యావహారిక భాష వ్రాసినా ప్రబంధములు మరిఒక విధ మైనభాషలో రచిస్తారు. ఈ కావ్య భాషలో కొంతభాగము వ్యావహారిక భాషలని.. మిగిలినది విశిష్టమైన ప్రాచీన భాష. అన్యభాషవలే నే నేర్చుకొంటే నేకాని తెనుగువారికి తెలియదు. రాజరాజనరేంద్రుని కాల మందుకూడా పండితులు తెలుగుభాష ద్వివిధముగా వ్రాసేవారా? ఏలాగున ఈవిషయము నిశ్చయించడము? కేవల లోక వ్యవహారముతో సంబంధముగల వ్రాత ఆకాలపుది దొరికితే అది ఈవిచారణకు తగిన ఆధారమవుతుంది.