పుట:2015.396258.Vyasavali.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యావహారిక భాషా బహిషార నిరసనము 87 దాయమునకు విరుద్దమయినదని తెలిసిన తరువాత నయినా తప్పుదిద్దుకొని, బహిష్కారము రద్దు చేయుటవారికి విహితకృత్యము. చెన్న పట్టణమందు, వెందట గామ్య భాషా నిరసనసభ జరిగినప్పుడు అధ్యక్షుడుగా ఉండి పరి: షత్తు వారి ఉద్యమమునకు ఆలంబన సంభమై నిలచిఉండిన కందుకూరి: వీరేశలింగంపంతులు గారు దురభిమానము లేనివారు గనుక నావల్ల ప్రాచీన సంప్రదాయము తెలుసుకొన్న వెంటనే నాతో ఏకీభవించి వర్తమానవ్యావహారి: కాంధ్రభాషా ప్రవర్తక సమాజము (28-2-1919) తేదీన స్థాపించి వారే దానికి అధ్యక్షులయినారు.