పుట:2015.396258.Vyasavali.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తీర వ్యాసావళి ఎవరేమన్నా గంగిరెద్దులాగున తల ఊపే పొమరజనులున్ను సభ్యమని మెచ్చు తొనే “గ్రాంథి కాంధ్రము” ఎవరినోటనూ వెల్వడదు; ఎవరిచెవినీ పడదు ! ఇక నేను పెద్దలు మేల్కొంటారా? మేల్కోరా! దేశీయమహాసభ వారం దరికీ వినబడేటట్లు «« ఇక నైనా మేలుకోండి మనజన్మహక్కులను గోరండీ!•• అని ఆదిమాంధ్రకవి కుసుమ ధర్మన్న గారు తమ సంఘమువారిని ఉద్బోధిస్తూ మేలుకొల్పు పాటపాడి నారు. తమ మోటిమాటే అవాచ్యమని అస్పృశ్య మని బహిష్కరించిన తమ పొరుగువారిని ఆపొచ్యులని అస్పృశ్యులని నిందించి మానవతులై మడికట్టుకొని వేరేకూర్చున్న పండితులం ఇతరుల మొర్రవిం టారా ప్రజల వాడుకభాషయొక్క ప్రయోజనములు అంగీకరించని పండి తుల చేతిలోనున్న అంకుశము తీసి వేస్తే నేకాని, ప్రజలహక్కులను నిరిబోధిస్తూ ఉన్న ప్రభుత్వమువారి చేతిలోని అంకుశమును లాగి వేసిన ప్రయోజనముండదు. నేడు ఆంధ్రరాష్ట్రము ఏర్పడవచ్చును; రేపు స్వరాజ్యము రావచ్చును; ప్రభుత్వము ప్రజాస్వామిక ము కానూవచ్చును. అయితే, ఈ రోజులలో మనస్వాములు నిరక్షరకుక్షులయి ఉంటే, దేశమునకు ఎంత ఉపద్రవము కలుగునో మన దేశ నాయకులు, దేశభక్తులు, దేశ బంధులు లెస్స గా ఆలో చించవలసి ఉన్నది. మన తెలుగువారిలో నూటికి 90 మందికి ఇంకా ఓన మాలైనా రావుసుమండీ ! | దేశ మన్ని విధములా అభివృద్ధిపొందడానికి అనుకూలమయేటట్టుగా, మునుపు ఉన్న ప్లే, వర్తమానవ్యావహారిక భాషే శాంథికభాషగా అంగీకరిం -దకతప్పదు. అదే లోకైక శరణము. ప్రాచీనాంధ్రభాషారచన పోషించ వలేవని ఆంధ్రసాహిత్య పరిషత్తువారికి ఉద్దేశముంటే వారు అట్లు చేయవచ్చును. కానీఅందుకొరకై వ్యావహారిక భాషను అణగదొక్కుటకు వారికి అధికార మ లేదు. వారు చేసిన వ్యావహారిక భాషాబహిష్కారము గొప్పతప్పు. దేశాభివృద్ధికి ప్రతికూలమయినది, వారు చేసిన పని ప్రాచీన సత్ సంప్ర