పుట:2015.396258.Vyasavali.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యావహారిక భాషా బహిస్తార నిరసనము 35 ఇతరజాతుల వారితో మన తెలుగువారున్ను సమముగా తులతూగుతూ ఉం దురుగదా. ఇప్పుడు ఇంగ్లాండు దేశములో కుండలు చేసే కుమ్మరివాండ్లూ, గనులలో బొగత్రవ్వే ఉప్పరులూ, పొలములందు న్నే పాలిపులూ, యం త్రాలతో మే కూలివాండ్లూ, సామ్రాజ్యవ్యవహార నిర్వాహదకులగుటకు చాలినంతయోగ్యత వర్తమానవ్యవహారాంగ్ల భాషద్వారా సంపొదించినట్టే, మనదేశములోని కార్మికులు కూడా వర్తమానవ్యావహారికాంధ్రభాషద్వారా మన దేశ వ్వవహార నిర్వాహకులగుటకు తగినయోగ్యత సంపాదించి ఉం దురుగ దా ! ఇంతకుపూర్వ మే స్వరాజ్య ము మనకు సిద్ధించిఉండునుగదా ! అయి తే మనదురదృష్టమువల్ల చిన్న యసూరి (గాంథిక భాషా దురభిమానను, విద్యాధికారుల అవివేకము చేత మారిమసగినట్టు చెల రేగి, వాస్తవ మైన దేశ భాషను నాశనము చేసి, మనకదుర్గ శకలిగించినది. ఈమారీ బాధను తొల: గించుటకే పదిపండెండేండ్లక్రిందట, పూర్వులతప్పు తెలిసికొని, ప్రభుత్వము వారు వ్యావహారిక భాషను తిరిగీ ఉద్దరించుటకు పూనుకొంటే, వారియందు విశ్వాసము లేని మన దేశ నాయకులు, ఈమారమ్మ పూజారులను, వారు ఆడించి నట్లు ఆడి కేకలు వేసే మారీభక్తులను వెనుక బెట్టుకొని, ప్రభుత్వము వారికి ప్రతిఘటించి, వారి ప్రయత్నము నిష్ఫలంచేసి, ఆంధ్రసారస్వతనిర్మాణము తిరిగీ ఈ పూజారులకే గుత్తకిచ్చి వేసినారు. ఇంగ్లాండులోని ఇప్పటి కార్మిక మంత్రుల నోటినుండి వెడలిన ప్రతి శబ్దమూ సభ్య మై సార్ధక మై, టెలిఫోనుల ద్వారానూ, టెలిగ్రాఫులద్వారానూ, కేబిలగాములద్వారానూ, వైర్ లెస్సులద్వారాను, మహాసముద్రములుదాటి, ప్రపంచమంతా వ్యాపించి మారు మోగుతూ పత్రికలలోను పుస్తకములలోను ప్రకటించుటకు యోగ్యమై ఉంటే, మనపరిషత్ పండితులు మాట్లాడేభాష అవాచ్యమా? నింద్యమా? నీచమా! “గామ్య భాషా' ఎంత అవివేకము! పండితులున్ను, వారి నిరం తర బోధ చేత మూడు లై ఉన్న వారి శిష్యులున్ను , మంచీచెడ్డా తెలుసుకోలేక