పుట:2015.396258.Vyasavali.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

4 వ్యాసావళి సినవిషయములు ఇతరులకు తెలిసేటట్టు ప్రకటిస్తూ, ఆదేశమందు కార్మికులు కూడా నౌకిక విద్యలు దినదిన ప్రవర్ధమానముగా చేస్తు న్నారు. ప్రాచీనాంగ్ల భాజపాండిత్యము, దేశాంతర భాషాపాండిత్యము వలె నే ఆవశ్యకమని కార్మికులు కూడా ఆంగీక రిస్తారు గాని, అది అందరికీ ఆవశ్యకమని తలంచరు. అపరిచిత భాషలు అభ్యసించడమునకు తీరిక, ఓపిక, ఆసక్తి గలవారు ఆవి. "నేర్చుకొని, వాటిలో రచిత మైన గ్రంథములందలి విషయములు దేశ భాషలో సాధ్యమైనంత స్పష్టముగా ప్రకటీకరిస్తూ ఉంటారు. ఏ భాషలోనున్నా! గ్రంథములో తెలుసుకోదగినది విషయము గాని, కేవలశబ్దము కాదు. మన దేశమందున్నట్టు ఆదేశమందు ప్రజలలో ప్రాచీనశబ్ద దేవతార్చన చేనే పొమ రులూ లేరు, చేయిస్తూ జీవనము చేసే యాజకులూ లేరు. చేస్తే పుణ్యమనీ చేయ కుంటే పాపమనీ చెప్పే పండిత పరిషత్తులూ లేవు. గడచిన యాభై అరవై సంవత్సరములలో ఇతర దేశములందు జరిగి నట్లే మన దేశమందున్న పరిస్థితులు మారినవి. హౌజలలో అనిర్వచనీయ మైన నూతనోత్సాహము పుట్టినది. సంఘ వ్యవస్థ, రాజ్య వ్యవస్థ ప్రజలందరి (శ్రేయోభివృద్దికి అనుకూలమైనట్లు మార్చుటకు సాధనముగా విద్యావిధానము ఏర్పడినది. ఆపుణ్యకాలమందు ఇతర దేశ ములందు పరిణమించి ఉన్న ప్లే మన దేశమందున్ను, విద్యాభ్యాసమునకు అనుకూల సాధనమై పరిణమించి ఉన్న మనవ్యావహారిక భాషే ఇతర దేశములలో చేసినట్టు, మన దేశమందు కూడా బడులలో విద్యాబోధకు సాధనముగాచేసిఉంటే, ఆదేశములలో వ్యాపించినట్లే, మనదేశమందున్న ప్రజలలో విద్య వ్యాపించి, మన దేశ భాష మెరుగెక్కి ప్రకాశిస్తూ ఉండునుగదా! సర్వజనసామాన్య మైన సారస్వతము విజృంభించి ఉండునుగదా ! ఇంగ్లీషువారికై నట్టే సమ శ్రదేశముల విజ్ఞాన మున్ను, మన తెలుగువారందరికీ మన తెలుగులో నే సుగమము, సులభము ఆయి, ఇరివ లెనే మన పన్ను విజ్ఞానసంపన్నులముఅయి ఉందువుగదా !