పుట:2015.396258.Vyasavali.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యావహారిక భాషా బహిష్కార నిరసనము 8t ఈవ్యాసమం దుదాహరించిన వివిధ గ్రంథములలోని వ్యావహారిక భాష ఎటువంటిదో తెలియజేయుటకు ఒక్కొక్కదానిలో నుండి కొన్ని వాక్యములు ఉదాహరించి అనుబంధము గా చేర్చవ లేనని ఉద్దేశించినాను; గానీ స్థలము లేదు, నావ్యాసము సుమారు ఎనిమిదిపుటలలో ఇమిడేటట్టుండ వ లేనని నిర్ణీత మైనది. ఈ వ్యావహారిక భాషా ప్రయోజనములు 1914 సం|| మున నేను ప్రకటించిన ఈ నిజమైన సంప్రదాయ”మనే వ్యాసమందు చిన్న మచ్చువాక్యములు చేర్చి చూపించి నాను. సవి సరముగా, సోదాహరణ ముగా, ఉపన్యసించి, ఈ ప్రయోజనములు మరల ప్రకటింపదలచి ఈ నాను.. ఆంధప్రబంధములందుకూడా సగ సకవులు పొడీన వ్యావహారిక భాష ప్రకటీక రింప నుద్దేశముగలవాడనై బాలకవిశరణ్యమ నే గ్రంధము రచింప నాగం భించి 4 నా తెలుగుపత్రిక లో కొంచెము అచ్చు వేయించినాను, అది పూర్తిగా రచించి కొలది కాలములో నే అచ్చు వేయిస్తాను. వ్యావహారిక భాషకు సారస్వత సామ్రాజ్యమందుగలహక్కులు పోగొట్టి దాని స్థానము ఆక్రమించి, భాషా ప్రపంచములో దానిని నిలవనీయకుండా హింసిస్తూ, నిరంకుశాధికారము చెలాయిస్తూ ఉన్న (గ్రాంథిక భాషయొక్క ప్రవృత్తి ఎంత జుగుప్సావహము గా ఉన్న దో దానివికృతి చేష్టలు కొన్ని బట్టబయట పెట్టు పెద్దలందరికీ తెలిసేటట్టు చూపిస్తే, దానిని తొలగించి వ్యావహారిక భాషను దానిపూర్వస్థానమందు మగల ప్రతి స్థాపించగలరని ఈకృతకగాంధీ కాంధ్ర” మనే పేరు పెట్టి వేరే మరిఒక గ్రంథముకూడా రచించుటకు సంకల్పించి ఉన్నా ను. | కట్టకడపటిమాట ఒకటి చెప్పి, నావ్యాసము ముగిస్తాను. తెలుగు దేశమందు మొట్ట మొదటనుండీన్నీ అనేక శతసంవత్సరములు సమ స్తసద్వ్యవ హారయోగ్యము గా అఖిలాంధ్రమహా రాజపూజితమై, సకల సద్వి ద్యాభ్యాస సాధనము గా నిఖిలాంధ్రపండి తావలంబనమై, ధర్మార్థకామ మోక్ష చతుర్విధ