పుట:2015.396258.Vyasavali.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

16 వ్యాసావళి వ్యావహారిక భాషాప్రయోజనములలో శిష్ట సంప్రదాయసిద్ధ మైనది ఒకటి వ్రాతలయందు కూడా తెలుగు దేశమంతటా 700 సంవత్సరములు శిలాక్ష'మై ఉన్నట్టు రుజువు చేసి నానుగదా. ఈ భాష సంభాషణయందే ని వ్రాతలయందు పూర్వులు జాడలేదని వాదించినవారి మాట అసత్య మనుటకు ఈ ఒక్క ప్రమాణమే చాలును. అయితే ఈ భాష అపరిమిత ప్రయోజనమని నేను రుజువుపర్చుటకు ప్రతిజ్ఞ చేసి ఉన్నా ను. కనుక మరి కొన్ని ప్రయోజనములు సప్రమాణము గా వివరించి చెప్పవలెను. ఆబాలగోపొలము తెలుగువారందరికీ పాడుటకూ వినుటకూ ఆసక్తి పుట్టించే పాటలు, పదాలు, కీర్తనలు మొదలయినవి వేలకొలదిగా ఉన్నవి. కొన్ని టీలో భక్తి, కొన్ని టిలో శృంగారము, కొన్ని టీలో జ్ఞానము, కొన్ని టిలో హాస్యము; ఇట్లే కరుణ, శోకము మొదలైన రసములు. అన్నీ వీటిలో వ్యక్త పడుతున్నవి. ఇవి వ్యావహారిక భాషలో నే సనాతన సత్సం ప్రదాయానుసారముగా పూర్వకవులు రచించేవారని తాటాకుమీద వ్రాసి ఉన్న ఈ పాటల పుస్తకాలు చూస్తే తెలుస్తుంది. ఇట్టి పుస్తకాలు దేశ మందంతటా ఉన్నవి. తంజావూరి సరస్వతీ మహలులో, చెన్న పట్టణము గవర్నమెంటు ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారమందు, ఆంధ్రసాహిత్య పరిషతు స్తక భాండాగారమందు చాలా గ్రంథములున్నవి. ఈ పొటలకు ఈ కావ్యి నామము చెల్లదా? సంస్కృతమందు జయ దేవుడు రచించిన గీత గోవిందమువంటివి కావా భరతశాస్త్ర ప్రవీణులయినవారు తిరుపతిలోని తాళ్ళపాకవారు, తంజావూరిలోని త్యాగరాయలు, మన్నో రుగుడిలోని సభాపతయ్య గారు, క్షేత్రయ గారు మొదలయిన వారు రచించిన తెలుగు కీర్తనలు? ఈ కవులు, పండితులు కారనగలరా? విద్వత్కవులు .వ్యావహారిక భాషలో ధర్మ శాసనములు రచించినట్టే, ఆ భాషలో పాటలూ పదాలూ కూడా రచించినారు. తాళ్ళపాకవారు సంస్కృతమున, ప్రాచీనాంధ్రమున