పుట:2015.396258.Vyasavali.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యావహారిక భాషా బహిష్కార నిరసనము 18 సరిహద్దులు వివరించి శాసనముకొసను ( విద్యాధికారి శ్రీనాధ్ వీర శ్రీ వేమభూపతే, అకగ్ దాక రవాహం నిర్మలం ధర్మశాసనమ్” అని చెప్పు కొన్నాడు. ఇప్లే ఆముక్తమాల్యద రచించిన కృష్ణ దేవరాయలు కోటాన కోట్లు వెలగల నవరత్న ఖచితసువర్ణాభరణములు తిరుపతి వేంకటేశ్వర స్వామికి సమర్పించి, “ దేశ భాషను” అనగా ఇప్పటి పండితులు గ్రామ్యమని దూషించి బహిష్కరించిన వ్యావహారిక భాషను తన ధర్మ శాసనము తానే స్వయముగా గచించియో, లేక తన సమ్మతిని పండితుల చేత రచియిం పించియో, తాటి కాయలంత లేసి అక్షరాలతో దేవాలయము రాతిగోడల మిద కలకాలమూ ఆబాలగోపాలము అందరూ చదివి తెలుసుకొనేటట్టుగా చెక్కించి ప్రకటించినాడు. మనుచరిత్ర రచించిన అలసాని పెద్దనకూడా శాను చేసిన దానధర్మములు వ్యావహారిక భాషలో రచించిన శాసనములో ప్రకటించినాడు. శ్రీంగమహాత్మ్యము, మామమహాత్మ్యము గాంథిక భాషలో రచించి, కవి అని ప్రఖ్యాతిపొందిన దక్షిణ సింహాసనాధ్యక్షుడైన విజయరంగ చొక్కనాధ నాయనయ్య వారి ధర్మ శాసనములు కూడా ఇట్టి భాషలో నే రచితమయినవి. ఇది అన్ని దేశ ములందున్ను సనాతన మైన శిస్టా చాగము. ఆశోకుని ధర్మ శాసనములన్నీ వ్యవహారమందున్న పాళీభాషలో ప్రకటితమయినవి. 1802 సం|| మొదలుకొని నేటివరకు ఇంగ్లీషు ప్రభుత్వము వారు తమ శాసనములన్నీ వ్యావహారిక భాషలో నే ప్రకటిస్తు న్నారు. ఇది సంప్రదాయ విరుద్దము కాదు. ఇందుకు దాఖలాగా వేరు వేరు ప్రదేశములందు వేరు వేరు కాలము లలో వేరు వేరు ధర్మ కార్యములు ప్రకటించుటకు గచిత మైన శాసనములు, వివరించకుండా కొన్ని సూచించి పేర్కొంటే చాలు ననుకొంటాను. విమ ర్శింప నుద్దేశముకలవారు నేను సూచించిన గ్రంథములలో శాసనములు , పూర్తిగా చదివి చూడవచ్చును. ఈ దిగువనున్న పట్టీలో ఈ ఎపీ) అంటే