పుట:2015.396258.Vyasavali.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యావహారిక భాషా బహిష్కార నిరసనము 9 యెదుట నే వారి గ్రంథములలోని భాషాదోషములు నిరూపించి చూపించి నాను. గొప్ప పండితుల గ్రంథములలో తప్పులు పట్టడము సాహసమే; కాని ఆ పని దురుద్దేశముతో చేయ లేదని త్రికరణశుద్ధిగా చెప్పుతున్నాను. సుపరిచితము కొని కేవల గాంథికాంధ్ర భాషను రచించుటకు పూనుకొంటే పండితులకై నా తప్పులు అనివార్యమైనప్పుడు, అపండితులయినవారికి ఆ భాష సుతరాం అసాధ్యమని రుజువుచేయడంకోసము విధి లేక నేను ఈ పని చేయవలసివచ్చినది. భీమునివంటివాండ్లకే జీర్ణము కాని ఆహారము పిల్లలకు పడదని చెప్పడము తప్పు కాదు. గాంథికాంధ్రభాషారచనకు మార్గదర్శ కులు పరవస్తు చిన్నయసూరిగారు. వారి నీతిచంద్రిక 'మొదటికూర్పు రెండవ కూగు వారు స్వయంగా అచ్చొత్తించినారు; వాటి ప్రతులు ఆంధ్రసాహిత్య పరిషత్తువారివద్ద నున్నవి. పిమ్మట అనేక మైన కూర్పులు అచ్చుపడ్డవి: ఎన్నో సవరణలు (కొన్ని మంచివీ, కొన్ని చెడ్డవీ పరిష్కర్తలు చేసి నారు; గాని, మొదటి కూర్పులోని తప్పులు కొన్ని ఇంకా నిలిచిఉన్న వి. కొక్కొండ వెంకటరత్నం పంతులు గారిని, కందుకూరి వీరేశలింగం పంతులు గారిని అనేక దుష్ట గ్రంథకర్తలకు ప్రతినిధులు * గణించి, వారి గ్రంథములలోని భాషా దోషములు శ్రీ వేదం వెంకటరాయశాస్త్రిగారు ప్రకటించినారు. ఈ శాస్త్రిగారి తప్పులు వేలకొలదిగా నేను వారి గ్రంథాలలో చూచినాను. కొన్ని నా తెలుగు పత్రికలలో ప్రకటించి, పత్రిక ప్రతులు వారికి పంపి సాను. వీరివంటివారే పురాణపండ మ్మయ్య శాస్త్రిగారు, మల్లాది సూర్య నారాయణశాస్త్రి గారు, కల్లూరి వెంకటరామశాస్త్రిగారు, శ్రీపాద కృష్ణ మూర్తిశాస్త్రిగారు, వావిలికొలను సుబ్బారావుపంతులుగారు, పొనుగంటి లక్ష్మీనరసింహారావు పంతులు గారు, కూచి నరసింహము పంతులుగారు, కొమజ్జిజు లక్ష్ముణరావు పంతులు గారు, చెలి కాని లచ్చారావు బహద్దరు గారు, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రిగారు, జయంతి రామయ్య పంతులు గారు