పుట:2015.396258.Vyasavali.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2

వ్యాసావళి

విద్వాంసులను అన్ని పట్టణములకు పంపి, ఈ బహిష్కారము చాటింపించి ఊరూరా సభలు కావించి, ఈ బహిష్కారము ఆంధ్ర మహాజనులు అంగీక రించినట్టుగా తీర్మా నములు చేయించినారు. పది వేల సంతక ములతో ప్రజల పేరిట మహజర్ నామా ప్రభుత్వమువారికి అంద జేయించినారు. అందుల ప్యావహారిక భాషను గ్రంథములు రచించుట పూర్వ సంప్రదాయమునకు విరుద్ధమనీ, అట్టి గ్రంథములు దేశమందు లేవనీ, ఉంటే అవి గ్రాంథిక భాషాజ్ఞానము లేనివారు వ్రాసినవనీ, ఈ కాలమం ద నేకులు నిర్దుష్టముగా (గాంథికాంధ్రమున సోనావిధ మైన గ్రంథములున్ను అ నేక ముగా రచిస్తు న్నా రనీ, వేలకొలదిగా పోటీ ప్రతులు పట్టణములలోను పల్లెలలోనూ ఆబాల గోపొలం అందరూ కొని చదువుతూ ఉన్నారనీ, బడులలో పిల్లల చేత గ్రాంథికాంధ్రాభ్యాసము చేయించడమే ప్రజలందరికీ ఇష్టమనీ, వ్యావ హారిక భాషాభ్యాసము ఎవ్వరికీ ఇష్టము కాదనీ గట్టిగా గవర్నమెంటు వారికి' నచ్చ జెప్పినారు. అర్జీలు, ఔలిగాములు, పత్రికలు, పుస్తకాలు అపరిమిత ముగా కురిపించి అందరిని అడలగొట్టినారు. కర్షక ప్రభువు నిరంకుశ ప్రభుత్వ మునకు ప్రతికూలముగా అధికార వర్గమునకు ప్రతిఘటించి ప్రభుత్వము వారిని ప్రజల ప్రతినిధులకు లొంగేటట్టు చేయుటకు పూనుకొని ఉన్న గౌ. శ్రీ నర సిం హేశ్వర శర్మగారు మొదలయినవారు ఈ విషయము తమ పనికి అను కూలముగా నున్నందున ఇది ఆధారముగా జేసుకొని విద్యాధికారులు బడు. లలో ప్రవేశ పెట్టిన వ్యావహారిక భాషను బహిష్కరించి ప్రజల స్వాతంత్ర్య ము సాధించి కృతకృత్యులై నారు గాని దేశ భాషను పరిషత్తుకు పండితులకు గుత్త కిచ్చి నేసినవారయినారు. ఇట్లే యూనివర్సిటీవారి వ్యావహారిక భాషాభిమానము కూడా గ్రాంథిక భాషాభిమానుల నీతితంత్ర ప్రయోగము చేత నిష్ఫల మైనది. యూనివర్సిటీ వారు నిర్ణయించిన కాంపోజిష కమిటీలో నలుగురు (గామ్యవాదులున్ను నలుగురు (గాంభిక వాదులున్ను ఇద్దరు మధ్యస్థ