పుట:2015.396258.Vyasavali.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యావహారిక భాషా బహిష్కార నిరసనము కదిపండ్రెండేండ్ల క్రిందట మ్య(గాంథిక వాదము చెల రేగినప్పుడు * ఆంధ్రసాహిత్య పరిషత్తువారు పంతగించి, వ్యావహారిక భాషగామ్య మని దూషించి దానిని బహిష్కరించినారు. వారు ఏ పండితులతో ఈ విషయమై సంవదించినారో వారిలో అధిక సంఖ్యాకులు ఇందుకు సమ్మ తించేటట్టు చేసినారు. ఈ సంస్కృతమందు వైదిక భాషకును లౌకిక భాషనును వ్యాకరణ సిద్దమైన భేద మెట్లు కలదో ఆ తెఱఁగున నే యాంధ్రమందును (గాంథిక భాషకును వ్యావహారిక భాషకును భేదము గ్రహింపవచ్చుననియు, లౌకిక భాష కేవల గామ్యమని విసర్జింపక దానికిం దగినట్లు వ్యాకరణ మ్పేఱచి యట్టి వ్యాకరణము ననుసరించి వ్యావహారిక భాషను గ్రంథ ములం బ్రయోగించుట కాజే పణ యుండఁగూడ దనియం ప్రఖ్యాత పండితు అయిన శ్రీ పేరి కాశీనాధశాస్త్రులవారు చేసిన హితోపదేశము తృణీకరించి నారు. లోకమందంతటా ఏ కాలమందు ఏ భాష శిష్టవ్యవహారమందు ఉంటుందో అదే దేశభాష అనిన్నీ, దానిలో నే అందరూ చదువుట కుపయో గించే గ్రంథములు రచించడము సదాచారముగా ఉన్న దనిన్ని , ఇంగ్లాండు మొదలయిన దేశములందు నెలకొని ఉన్న సత్సంప్రదాయము చొప్పున శ్రీ గురజాడ వేంకటప్పారావు పంతులు గారున్ను నేనున్నూ చేసిన యువ దేశము త్రోసి పొర వేసి నారు. అటుపిమ్మట పరిషత్తు వారే కొందరు ఈ వ్యాసము *** భారతి' మొదటి సంపుటము, 5, 6, సంచిక ల నుండి పునర్పు దిశము .