పుట:2015.396258.Vyasavali.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
106

వ్యాసావళి

సారస్వతముల విచారణలోనైనా సత్యమందే మాకు పట్టుదల గస్ని, నాదులయెడలను ప్రతివాదులయెడలను ద్వేష ముండదు; అందరున్ను మిత్రులే. ఇదిమాసంకల్పము.

    రాబోయేసంచికలలో మేము విచారించదలచుకొన్న విషయములు:— (1) తెలుగుమాటల సాధుత్వాసాధుత్వముల నిర్ణయము. అసాధువులనుకొన్న అనేక శబ్దములు సాధువు లనుకొనుటకు ప్రమాణములు (2) నన్నయ భారతములోని పదములపట్టిక. (3)తెలుగు పదముల రూపాంతరములు. (4) సంస్కృతపదముల రూపాంతరములు. (5) అంత్యవర్ణనములనుబట్టి (అకారాంతాదిగా) ఏర్పరచిన తెలుగుమాటల పట్టిక. (6) గ్రంధములలో పాఠాంతరములు (7) తెలుభషాచరిత్రమునకు కావలసిన సామగ్రి. (8)నేటితెలుగుభాషకు లక్షణము ఏర్పరచుటకు కావలసిన సామగ్రి. (9) మనపూర్వులువ్రాసిన వచనరచనకు ఉదాహరణములు. (10) తెలుగులో చేరిన అన్యదేశ్యములు. (11) తెలుగుమాటల వ్యుత్పత్తి. (12) తెలుగునిఘంటువులలోని లోపములు (13) తెలుగు యాకరణములలోని లోపములు. (14) తెలుగుచందస్సు. (15) దేశము, జజ్తి, వృత్తి మొదలయిన వాటిలో భేధమునుబట్టి తెలుగుభాషలో కలిగినభేదములు.(16) సర్వజన సామాన్యమైన విషయములు బోధించే పుస్తకములు. (17) నేడు తెలుగుగ్రంధములలో వాడుతూఉన్న భాష. (18) సారస్వత విమర్శ. (19) భాషాతత్వము. (20) అన్యదేశముల సారస్వతము. (21) విధ్యాభివృద్ది.
  బ్రహ్మాండమంత పనిఏమిటి! చిన్నచీమలవంటి మేమేమిటి! ఎంతసాహసము ! అనిభయపడి, విముఖులమైఉంటే, మా మిత్రులు ‘మీరు పనిమొదలుపెట్టితే, సాయంచేసేవారు లేకపోతారా? మీవలెనే ఈ విషయములు విచారిస్తున్నవారు కొందరున్నారు. ఒకరికొకరు తోడ