పుట:2015.396258.Vyasavali.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

105

విన్నపము

సరస్వతీ మహా మహోపాధ్యాయులవారే తమ ప్రబంధములు కావ్యభాషలో వ్రాసి, ఆంధ్రశబ్ధ చింతామణికి టీక వ్యావహారిక భాషలో వ్రాసినారు. అప్ప కవివంటి లాక్షణికుడు తన లక్షణ గ్రంధములలో పద్యాలన్నీ కావ్యభాషలో వ్రాసినా అవతారికలు, వ్యాఖ్యలు, టీకలు మొదలయిన వచనములన్నీ,-- ఒకటీ రెండూ కాదు, వందలున్నవి -- వ్యవహారిక భాషలో వ్రాసినవాడు. అచ్చుపడ్డ అప్పకవీయమందు 1859 వ సం॥ లో పరిష్కర్తలు ఈ వచనములోని వాడుకభాష కావ్యభాషగామార్చివేసినారు. *ఇట్లే భారతము కక్ష్మీపతిగారు భారతమునకున్నా ముద్దరాజు రామన్న రఘవ పాండవీయమునకున్ను, చిత్రకవి అనంతుడు హరిశ్చంద్ర నళీయమున కున్ను, సోమనాధ పండితుడు, జూలూరు అప్పయపంతులు. శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి మొదలయినవారు వసుచరిత్రకున్ను వ్యావహారికభాషలో టీకలు వ్రాసినారు. అనేక వ్రాతపుస్తకములు దేశమందున్నవి. వందలకొలదిగా పండితులు, కవులు, రాజులు, మంత్రులు, సేనాపతులు మొదలయినవారు వాడుక మాటలలో వ్రాసిన వ్రాతలు ప్రచురముగా మాకంటికి కనబడడముచేత ఈ విషయమందు మాకుధృడమైన విశ్వాసము కలిగి, వాస్తవమయిన సంప్రదాయము లోకములో బహిరంగముగా ప్రకటించడము మంచిది అని తోచి ఈ పత్రికాముఖమున విజ్ఞప్తి చేయుడమునకు సాహసించినాము.

   ఇంకొక్కమాట, తెలుగువారివిద్య, వారిభాష, వారిసారస్వతము-- వీటిని గురించేకాని యితర విషయములలోనికి మేము పోము. తెలుగువారి విద్య్తకు ఆటంకములు కాకుండా ఉంటే రాచకార్యములతో గాని, మతముతోగాని, జాతితోగాని, మరి దేనితోగాని, మాకు పనిలేదు. భాషా

_________________________________

  • అప్పకవీయము వ్రాతప్రతులు ఇరువై చూచి ఉన్నాము. అన్నిటిలోనూ మేము చెప్పినట్లే వచన మున్నది. ఆంధ్రవిజ్ఞాన సర్వస్వములో మ॥కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు గారు చెప్పినవి చూడవచ్చును.