పుట:2015.396258.Vyasavali.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

101

విన్నపము

'క. తొలిబాసయందు వలె నీ తెలుగుంబాస వెలయించు
    దీపములేమిన్
    నిలువగల కవుల లక్ష్యమ్ములె తా మీ భారమెల్ల
    మోయగవలయున్.'

అని తమ గ్రంధములలో స్పష్టముగా తమప్రమాణము విశదపర్చినారు.

    మాకు  వీరే మార్గదర్శకులు, కావ్యభాషలో శబ్దముల సాధుత్వాసాధుత్వములు నిర్నయించడానకు కవుల ప్రయోగములే ప్రమాణము* ఈ ప్రయోగములు లక్ష్యముగా చేసుకొని వాటికి విరొధము రాకుండా దాక్షణికులు లక్షణము చెప్పవలెను. ఈ లక్షణశాస్త్రము  భాషావిషయములో కవికి సంకెళ్ళు వేయడమునకు అధికారము కలది కాదు; పూర్వకవుల వాడుకకు జ్ఞాపకమాత్రము; ఆ విషయములో కవికి లోకమే ప్రమాణము. జౌచితిని బట్టి ప్రాచీన శబ్దముగా, నవీనశబ్దముగా, దేశ్యాలూ, అన్యదేశాలూ యధేష్టముగా వాడవచ్చును కవి. ఈ ప్రకారముగానే ఏకాలములందున్న కవులు ఆ కాలమందు లోకములో ఉన్న భాషారూపములు వాడి ఉన్నారు. కావలసినన్ని శబ్దము లట్టివి ఉదాహరించవచ్చును. ఇట్టి శబ్దములు అనేకములు కవిప్రయోగరూఢములని ఎరుగక కేవలగ్రామ్యము లనుకొని వ్యావహారిక భాష అపభ్రంశమనిన్ని, గ్రంధములందు ప్రవృత్తి లేనిదనిన్ని బాలురు, బాలికలు, భ్రమపడేటట్టుగా డాంబికులు తాము వాడ డము మానివేసి, ఇతరులు వాడితే ఆక్షేపిస్తూ ఇప్పు డేదో గ్రాంధికభాషట వ్రాస్తున్నారు. ఈ పత్రికలో వచ్చే నెలనుండి ఇట్టి శబ్దములు విమర్శించి, వాటి ప్రయోగములు మాకు చిక్కినన్ని చూపించి, వాటి సాధుత్వము సిద్ధాంతము చేయ నుద్దేసించినాము. అనేకగ్రంధములు చదివిన పండితులు సయాయము  లేనిదీ ఈ ఉద్యమము బాగుగా నెరవేరదు గనుక అట్టి వారు మాకు తోడ్పడుదురుగాక.

_______________________________

  • చూ. కొవ్వూరి సారస్వత మహాకవివారి తీర్పు (మూడవ వ్యాసము)