పుట:2015.396258.Vyasavali.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
100

వ్యాసావళి

    అని కవిరాజ మనోరంజనములో వ్రాసినాడు. ప్రాచీనలక్ష్ణమే పరమ ప్రమాణముగాను ప్రాచీనభాషే శిష్ట భాషగాను ఎన్నుకొని, పాతకంపే తమకింపుగా వ్రాయడము ఎంతప్రచురముగా ఉన్నా, సరస కవులు కొందరువాడుక మాటలకు కావ్యములందు ప్రవృత్తి కలిపిస్తున్నారు. ఇతరులు ఆపేక్స్జిస్తే వారుభయపడరు. చూడండి ఏమంటున్నారో నేటికవులు కొందరు.

ఉ॥కాలముబట్టి దేశమును గాంచి ప్రభుత్వము నెంచి దేశ భా
   షాలలితాంగి మాఱుటఫి సత్కవి సమ్మతమౌట, నన్య దే
   శ్యాలును నాంధ్రభాష గలనౌటను, నౌచితిబట్టి మేము క
   బ్బాలను వాడుచుంటి మని పండితు లేగతి నొప్పుకుందురో!

     సెభాష్! తిరుపతివేంకటేశ్వరకవులు ! మీరునిజమైన ఆత్మగౌరవము గలకవులు!’కాలము, దేశము, ప్రభుత్వము, భాష—మారక తప్పదు; అన్యదేశములతో సంబంధమున్నప్పుడు అన్యదేశాలు భాషలోచేరక మానవు. ఔచిత్యము, ఏర్పరించడములో కవి హంసవంటివాడు, తన అంత:కరణ ప్రవృత్తే కవికిప్రమాణము.’ ఎంతచక్కగా చెప్పినారు!
   ఈకవుల కావ్యములను విమర్శించినవారు;శబ్ద రత్నాకరమునుబట్టీ, చిన్నయసూరి వ్యాకరణమునుబట్టీ, తప్పులెన్నినప్పుడు,పంచాంగములో చెప్పకపోతే ఆకాశముమీద నక్షత్రాలుండరదాఅనీ, ప్రయోగమూలం వ్యాకరణము గనుక ప్రయోగమే ప్రమాణమనీ, సిద్ధిర్లోకాద్దృశ్యా అని, నిరంకుశా:కవయ: అనీ, సమాధానము చెప్పినదే కాక,

‘క. వ్యాకరణ మొక్కత్రోవ, మహాకవులొకత్రోవ, కోశమఖిలమ్మొక
   త్రోవై కనుపట్టెడి నీ భాషా కావ్యమ్ములను దఱచు చదివిన కొలదిన్.’