పుట:2015.396258.Vyasavali.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

99

విన్నపము

   రసవంతమైన కావ్యములు రచించిన వారందరిని లాక్షణీకులు ఎందుకో ఒకందుకు నిందించడము అరుదుకాదు. కుకవుల నింద మామూలేకదా. రసికుల యినవారు పిచ్చలచ్చనాలు పాటించలేదు. వాస్తావ ముగా కవులు స్వేచ్చావిహారులు. వారి రుచే వారికి ప్రమాణము. వారికి శబ్ద సిద్ధి లోకమువల్లనే తెలుస్తుంది. వారి ప్రయోగములే లక్షణమునకు లక్ష్యములు. అన్ని దేశములలో కవులకు ఈ అధికారము, ఈస్వేచ్చ ఉచిత మైనదని అంగీకరించినవే. ఏ కవి ఇతరులు చెప్పిన లక్షణమునకు భయపడి తన మతము మార్చుకొంటాడో ఆకవి అస్వతంత్రుడు; ఆతని కవిత్వము అతనిది కాదు; అతని వన్నీ ఎరువే; పంజరములో రెక్కలు కత్తిరించి పెట్టిన చిలక లాగున 'కృష్ణతాతా-తోటకూరా ' అని పలక వలసినవాడే కాని యెధేష్టముగా వనమందు విహరిస్తూ కూజించే కోకిల వలె పాడలేడు. అందుచేతనే, సహజమైన రీతిని పదములు కూర్చితే కవిత సొంపుగా ఉంటుందిగాని మాసికలువేస్తే  ఉండదు.

మ॥ చరుగుల్ పూర్వ కవీంద్రు లన్నిటకు; నేస్వల్ప జ్ఞాడన్ స్వాకిమిన్
       హితమో కాదో మదీయ కావ్యమని వారెలా విచారింప; న
       గ్రతమాలల్ వ్యవహారభర్తలయినంగానీ, కడుం బాలుడౌ
       సుకు నవక్తపు మాట తండ్రి కొనవించున్ గాన యానందమున్॥

    అని అబ్బయామాత్యుడు సెప్పినాడు. అతడే లాక్షిణికులను పరిహసించి సరస్వతి తనకు నేర్పిన మాటలనే వాడుతానని:--

ఉ॥ చెల్లునటంచు నొక్క కవి చేసిన లక్షణ మొక్క రివ్వలన్,
      జెల్లమిజేసి తా నొకటి చెప్పగ చాందసవిస్తగంబు సం
      ధిల్లుట గావ్యశంక అననిం దఱుచయ్యె రసజ్ఞలారా! నా
      యుల్లపు సౌధనీధి గొలువున్న సరస్వతి సత్యవాణి నా
      తల్లి యొసంగు సంస్కృతిని తప్పులు చేయక చిత్తగింపుడీ॥