పుట:2015.396258.Vyasavali.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

98

విన్నపము

సులభముగా ఉంటుంది. మాటకు, ఇంగ్లీషు వారిలో అనెకులు ఫ్రెంచి, జర్మన్, ఇటాలియన్, పోర్తుగీసు, స్పానిష్ మొదలయిన యూరోపియన్ భాషలు అన్నీ గాని కొన్నిగాని అవకాశముకొలదీ నెర్చుకొన్న వారున్నారు. మన చక్రవర్తిగారికి ఎన్నో భాషలు వచ్చును. స్వదేశ భాషవలెనే స్వెచ్చగా తడువుకోకుండా వారు ఇతరదేశభాషలు మటాడగలరు; వ్రాయగలరు. ఇతరులతో సహవాసము ఛేయుడము చేతను, ఆభాషే గ్రంధములలోను వార్తాపత్రికలలోను కంటితో చూచి చదవడము చేతను--- ఇట్లు చెవికి, నాలుకకు, కంటికి, చేతికి కూడా అలవాటయి వ్యత్యాసము లేకుండా ఏకరూపమయిన భాష మనస్సులో నాటుకొంటున్నది. లోకవ్యహారమందు ప్రవృత్తి లేక గ్రంధలందే ఉన్న బాషను దాని లక్షణమంతా వల్లించినా వాడుక చేయడము సులభము కాదని అందరికీ తెలిసిన విషయమే. సంస్కృత వ్యాకరణమంతా కంఠపాఠము చేసిన వారందరూ స్వీచ్చగా లౌకిక వ్యవహారమును గురించి సంస్కృతమున మాట్లాడలేరు. వ్యాయనూలేరని చెప్పవచ్చును. మనదేశమందు వేలకొలది హిందువులు హిందూస్తాని భాష మాట్లాడగలరు. అనేకమంది అరవలు తెనుగున్న, అనేకమంది తెనుగులు అరవమున్ను స్వేచ్చగా మాట్లడ గలరు. తడువుకోకుండా అన్యభాషలు మాటాడగలిగిన స్త్రీలను చూచివారు ఎంతో మందిని--ఒక్క అక్షరమైనా వ్రాయలేని వారని నేడువేరు భాషలు రెండు మాట్లాడే జనులు ఎక్కడ కలిసి ఉంటే అక్కడ రెండు భాషలకూ ప్రవృత్తి కలిగి చాలా మందికి రెండు భాషలూ ఆలవాటు కాగవు.

    ఇది మనయందరమూ ఎరిగిన విషయమే. వాడుకలో ఉన్మ భాష  వ్రాతలో కూడా పెట్టితే, అక్షరములు మాత్రము నేర్చుకొంటే చాలును. ఎవరయినా ఆ భాష చదువవచ్చు; వ్రాయవచ్చును. యూరపుగాని