పుట:2015.396258.Vyasavali.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
92

వ్యాసావళి

    ఇట్లు అన్నిదేశములలోనూ తాత్కాలికముగా పెద్దలు వాడుకొనే భాషకే లోకమందు ప్రవృత్తి కనపడు చున్నది. కాని ప్రాచీనగ్రంధములందే నిల్చి వాడుకలో లేని భాషకు గాని శబ్దములకు గాని విభక్తులకు గాని ప్రవృత్తికానరాదు. నేడు ఇంగ్లీషు వారిలో తగు మనుష్యులు సభలో సంవాదము చేస్తూ ఉన్నప్పుడు గాని న్యాయసభలో న్యాయవాదులు ధర్మోపధర్మములు చేస్తూ ఉన్నప్పుడు గాని, వారి నోటను వచ్చే వాక్య్తములు కాగితముపైని వ్రాస్తే వాటిలోని భాషకున్న గ్రంధములలోని భాష కున్న వ్యత్యాస ముండదు; ఉన్నా అత్యల్పము. అంతమాత్రాన అవి వేరు భాషలు కావు; మొత్తముమీద రెండూ ఒకటే భాష.
   ఇంగ్లండులో ఉన్నట్లే ఇతర దేశములలోను వ్రాయదమనుకొన్న మాట్లాడదమనుకొన్న ఒకటే భాష ఉన్నందున అనేక తరముల నుండి సభ్యముకాని ఉప భాషలు * మాట్లుడడమునకు అలవాటు పడ్డవారు సయితము యిప్పుడు పెద్దల సహకారము వల్లను, చదువు వల్లను, సభలకు వెళ్ళుటవల్లను, క్రమక్రమముగా పెద్దలభాష నేరుకోవ డమునము వీలు కలుగుతున్నది. అందుచేత పూర్వకాలమునందు ఉపభాషలకున్న అల్ప ప్రవృత్తి కూడా రానురాను తగ్గిపోయినది; వాటిలోనివి కొన్ని అంతరించినవి. ఇప్పుడు పెద్దల భాషే దేశమంతా అల్లుకొంటున్నది. భాషవల్ల జనులలో పరస్పర సంబంధము ధృఢపడుతున్నది. భాష సామాన్యమై నప్పుడు పుస్తకములు సామాన్యముకావా? అందువల్ల జ్ఞానము సామాన్యము. భావములు సామాన్యము. అందుల  ఫలము సంఘమునకు ఐకమత్యము.
    ఇంతేకాదు, నోటిమాటకు చేతి వ్రాతకు సామ్య మున్నందువల్ల లాబము, ఒక దేశమువారు మరి ఒక దేశభాషను నేర్చుకొనుట చాల

_________________________________

  • Provincial dialects.