పుట:2015.393685.Umar-Kayyam.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

ఉమర్ ఖయ్యామ్

204

సొగసుల కాలవాలమయి చూచెడు నీజగ మంధకారమై
తెగువను వచ్చి ఱిచ్చవడఁ దీసుకపోవును; నిట్టు లెందఱో
యెగిరి నశించినారు; మఱియెందఱో రానయి యున్నవార లీ
వగ సహజంబు గాన మనవంతు సుఖంబుల మాను టొప్పునే.

205

మృత్యువు గంతువేసి నిను మ్రింగక పూర్వమె మద్యపాత్ర నౌ
చిత్యము మీఱఁ దెమ్మని వచింపుము; నిద్దుర పోదువేల? యౌ
ద్ధత్యముతోడ నిన్నెపుడొ ధాత్రిని బూడ్చి సమాధి సేతు రా
కృత్య మెఱుంగవో? తిరిగి యెన్నఁటికైనను బైకి వత్తువే?

206

నాకన్నీళ్లు సముద్రముగాములయి నన్ మాయించె; నాయేడు ప
య్యాకాశంబున కంటె రేబవలు; కాంతా! యెందు దాఁకొంటి వ
య్యో! కల్పాంతముదాక శీధువును నీతోఁ ద్రావవాంఛింతునా
హా! కాలం బొకపూటయైన గడువీయంబోవ దర్థించినన్.

207

ఆయువు నమ్మి గర్వపడ రార్యులు; చచ్చిన నేడొ, ఱేపొ నీ
కాయము మట్టిలోఁగలిసి కైవసమౌను, బ్రజల్ ద్వదీయ మృ
చ్ఛాయను జేతు రెన్నొ కలశంబులఁ గావున శీధుపానమున్
జేయుము బంధమోక్షములఁజెందవు హాయిగ మోదమందుమా.