పుట:2015.393685.Umar-Kayyam.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

ఉమర్ ఖయ్యామ్

179

ఏటి కుషస్సునందు నెలుఁ గెత్తి పదేపదె కుక్కుటంబు ఱా
కోటలు మాఱుమ్రోయఁగను గోక్కొరొకోయని, కూయుడుండె నా
నాఁటికినాయు వొక్కొక దినంబు నశించు నటంచుదాని కా
పూటను నర్థమున్ దెలుపఁ బోలుఁ బ్రమత్తతనేర వీ వదిన్.

180

ఏవి యెన్నాళ్ళ కయినను గావొ యింక
నామనోరథములు సిద్ధి యగుట కల్ల
అట్టిజిజ్ఞాస వృద్ధుఁడ వగుటకంటె
వాని వర్జించి వ్యసనంబుఁ బాయు టొప్పు.

181

శత్రు విడుబాధలను జెప్ప మిత్రునొద్ద
కేగి తనకష్టములు చెప్ప సాగినప్పు
డతఁడె బాధింప పరుషోక్తు రాడెనేని
చేయఁగలకార్య మున్నదే చెప్పు మింక ?

182

స్వేచ్చోపభోగము

మా మధుశాలనుండి యొక మాఱు ప్రభాతపువేళ శీత వా
తాముఖమైనయొక్కపలు కల్ల వినంబడె "ఓవిరాగి ? యో
ప్రేమరసస్వరూప ! నిదురింపకు లెమ్మిఁక నాసవంబుతో
నీమధుపాత్ర నింపు ; బ్రతు కింకముగింపకముందె" యంచొగిన్.