పుట:2015.393685.Umar-Kayyam.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

37

143

మనుజకోటిలోఁ దెలివిగా మసలవలయు
నెల్ల పనులందు శాంతిమై నెసఁగవలయు
శ్రవణనయన జిహ్వేంద్రియ శక్తు లెంత
గలిగియున్నను లేనట్లె మెలఁగవలయు.

144

ఎంతవఱకు వాసన, రంగు నిచ్ఛయింతు
వేల పుణ్యపాపాలకై యేగుచుంటి
వరయ విషపాత్రమైన నీ వమృతకలశ
మైనఁ గాటి కేఁగుట తథ్యమని యెఱుంగు.

145

జనులు నిను దారిఁగని పూజ సలుపరాదు ;
లేవఁగారాదు, నిను మ్రొక్కఁ బోవరాదు ?
ఈవు "మస్జిదు" కేఁగిన నెన్నఁడేని
గురువుగా నుండ నిను వారు కోరరాదు.

146

తెలివి గలదేని, తెలివినే తెలిసికొనుము ;
మంచి గలదేని చెడ్డ వర్జింపు ; మీవు
గౌరవించినఁబ్రజ నిన్ను గౌరవించు ;
నగుచునే యుండు ; నిను నీవు పొగడుకొనకు.