పుట:2015.393685.Umar-Kayyam.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

ఉమర్ ఖయ్యామ్

139

పరు లుచితంముగా నొసఁగు పానకమైనను ద్రావినప్డు నా
కరుచి జనించు దాని శమనార్థము మద్యముద్రావి తద్వ్యథా
భరమును బాపుకోవలసి వచ్చెను ; నన్యులయుప్పు రొట్టెలోఁ
దొరలు టసహ్య ; మా లవమె దుఃఖము దెచ్చి మనంబునేర్చెడున్.

140

జగతీదుఃఖ మొకింత మామనములోఁ జర్చింపగాలేదు ; రే
బగ లెం దెప్పుడొ గుప్పెఁడన్నము లభింపన్ జాలు ; లేకున్న చో
వగపే లేదు ; మహానసస్థలములోఁ బక్వాన్నమే చిక్కుచుం
డఁగ నన్యుం గని వేఁడ నేటి ? కది మూఢత్వంబు ముమ్మాటికిన్.

141

నీ తనువందు మాంసమును నెమ్ములు గల్గెడుదాఁక నెవ్వనిన్
జేతులు చాచి దేహి యని చేరకు ; ప్రాప్తము నమ్మియుండు ; మా
"హాతిము" మిత్రుఁడైన వినయంబునుజూపకు ; "జాలు" "రుస్తుము"
వ్రాతము శత్రులైనఁ దలవంపకు భీతిలి యెన్నఁడేనియున్.

142

విజిగీషన్, నిజబాహుసత్వమున నీ విశ్వప్రపంచంబునన్,
బ్రజచే నెచ్చిన క్రూరఘోర కుటిలవ్యాపార కాలాహతిన్
రజమైపోయినఁ బోదు గాని, యనలవ్రాతంబులోఁ గాలుచున్
గుజసుం డిచ్చు జలంబు సుంత గొన నీకున్ జెల్ల దేనాఁటికిన్.