పుట:2015.393685.Umar-Kayyam.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

ఉమర్ ఖయ్యామ్

131

ఒరులకు దాస్యమున్ సలుపకుండఁ గడిందిబలప్రతాపుఁడై
యొరులపయిన్ బ్రభుత్వమును నొందనిఫక్కిని బండఁబంచయున్
దిరిపెమునెత్తకుండఁ దినుతిండికినై కడియన్న మున్న యా
నరుఁడె కృతార్థుఁ డన్నిట ననంత దిగంత పురాంతసీమలన్.

132

వినుము నెచ్చెలి ! యీ కాల విధముగూర్చి
వగవఁబోవకు ; మేకాంతవాసి వగుచు
విధివిధానంబు నరయుచు వేళ వెళ్ళఁ
బుచ్చువలయును ; వేఱేమి బోధపడదు.

133

విషయాసక్తికి లొంగిపోవక మహావేగంబుతోఁబోవు నా
విషరాశింబలెఁదీవ్రవహ్ని విలసద్విస్ఫూర్తి మైఁదాల్చి పౌ
రుషలీలన్ మనఁజెల్లుఁ గాని, రజమై రోదోంతరాళఁబునన్
దృషితోద్వృత్తినిఁ బోవునట్టి బ్రతు కింకేలా విచారింపఁగన్.

134

రాగద్వేషము లాశ్రయించి, విషయభ్రాంతిన్ బ్రవర్తింప ను
ద్యోగింపన్ దగు నీజగాన విధిసంయోగంబుచే నెందఱో
భోగాపేక్షను వచ్చి పోయి ; రిటులే ముం దింక రానున్న వా
రేగఁన్ జూతురు ; గాని, యొక్కఁడయినన్ స్వేష్టార్థమున్‌గాంచెనే ?