పుట:2015.393685.Umar-Kayyam.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

ఉమర్ ఖయ్యామ్

123

ఏ నొకనాఁడు నేల నిదురించుచునుండఁగఁ గోవిందుండు నా
తోనిటు లాడె ; "నీపగిదిఁ దొంగియె యుండెద వేల లోకమం
దే నిదురింప నీజగతి నీప్సితముల్ సమకూడఁ బోవు ; గో
రీ నిఁక ముందు పండి నిదురింతువు లేవవు పెద్దకాలమున్."

124

నీమతి యింటికుక్కవలె నీల్గుచు నున్నది ; వట్టిబూటకా
లే మొఱుఁగున్ ; నృగాలము వలెన్ గడు ధూర్త శశంబురీతి ని
ద్రా మహితఁబు వ్యాఘ్రము విధాన భయానకమాతృ కాకృతిన్
దామసరాగరోషకలితం బయి యున్నది చూడు మన్నిటన్.

125

శత్రుఁడే తోడుపడినచో మిత్రుఁడగును
మిత్రుఁడే హాని చేసిన శత్రుఁడగును
విషము వికటింపకున్న నావిషమె యమృత
మమృత మైనను వికటింప నదియె విషము.

126

దుఃఖ మెదఁ జొరనీయ ; కేదోవిధానఁ
దప్పకున్నెడ రానిమ్ము ; తరలనిమ్ము ;
హాయిగాఁ దిను ; మిడు మన్యు లడుగునెడల
వేలు ధనరాసు లున్న నీ వెంటరావు.