పుట:2015.393685.Umar-Kayyam.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

31

119

శత్రుమిత్రులయెడ మేలు సలుపవలయు
కోవిదుం డన్యులకుఁ గీడు కోరఁబోఁడు
మిత్రుఁ దిట్టిన నాతఁడు శత్రుఁడగును
శత్రుఁ బొగడిన నాతఁడు మిత్రుఁడగును.

120

నాతప్పుల కేడ్తును ; బరు
లేతప్ఫులు సేయుచున్న నే నెగ్గింపన్
బాతకముసలుపుప్రజఁ గని
భూతలమును విడువ బుద్ధి పుట్టెడు నాకున్.

121

నీ వాకాశము నెక్కి నిక్కినఁబ్రజల్ నిన్‌భూమిపైఁ ద్రోతు రిం
దీవెంతో సొగసైనవాఁడ నని గర్వింపన్ గడున్ దీనుగాఁ
గావించున్ బ్రజ ; కాన నీవు ప్రజతోఁ గయ్యంబు వర్జించి యెం
తో వారిం గని తోడునీడగుము నీతో వారు తోడౌనటుల్.

122

ఒరులు నిను నొవ్వనాడిన నోర్చుకొనుము
ఎదిరిచే హాని సతము సంధిల్లిచున్నఁ
గోవిదులచాటుఁ జొచ్చి దాఁగుటయ లెస్స
మన్ను జలవాయువహ్నులే మనుజకోటి.