పుట:2015.393685.Umar-Kayyam.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

ఉమర్ ఖయ్యామ్

115

మధుమాంసంబులు వచ్చుఁబోవును ; లసన్మాధుర్యమై యాయు వా
పథమందే నశియించుఁ గావున సురాపానంబు గావింపు మే
వ్యధలం బొందవు ; దుఃఖమే విషము ; నిత్యం బా విషవ్యాధికిన్
మధుపానంబె మహౌషధంబు ; బుధు లీమార్గంబుఁ జూపింపరే.

116

నీతి

దేనిచె వగ నీ కగునో
దానిని గని దుఃఖమొందఁ దగ దన్యులతో
మానసిక వ్యధ లడఁగిన
నానందించెదవు నీవె యతిధన్యుఁడవై.

117

కష్టము దలిగిన నోర్చి య
భీష్టాప్తిని నొందు ; బుధుల వీక్షించినచో
సాష్టాంగమనుము ; పిన్నల
నిష్టంబుగఁ బల్కి సంతసింపుము సతమున్.

118

నీవు ధరిత్రిఁ గామవిషయేచ్ఛలకై జనించినట్లు నీ
భావమునన్ దలంపకుము ; వ్యర్థుఁడవై నశించిపోదు ; వే
తావులనుండి వచ్చితివొ తథ్యము నీవన నేమివస్తువో,
నీవిపు డే మొనర్చుటకు నెంచతివో పరికింపు మెంతయున్.