పుట:2015.393685.Umar-Kayyam.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగ్బరాంబ

శా. ఆ ఢిల్లీ నగరాంగ్ల శాసన సభాభ్యర్థిత్వ మర్థింపుఁ డం
     చాడన్ నేను కృతార్ధుఁడై జనిన నాకై వచ్చి ప్రాణంబులున్
     వీడెన్ నాసతి అగ్బరాంబిక చిలత్ విద్యుల్ల తన్ బోలె ; యీ
     నాఁ డే నశ్రులు 'గోరి' పైవిడుచుచు న్వర్తింతు నిర్జీవినై.

ఉ. ఏను రచించినిట్టి కృతు లెన్నిఁటినో వినె తల్లి ; తండ్రి నా
    నా నవనాటక ప్రకరణంబులు నాఁడగ జూచినారు ; ఢి
    ల్లీ నగ రాంగ్ల భారతమహీధవ శాసనసభ్య సత్పదం
    బానఁగ గాంచి 'అగ్బ' రమరాలయమేగె వెలుంగు చుక్కయై.

  • సూపీ వేదాంతదర్శము

శా. ఎన్నోబాధలు బొందుచుండు మని నన్నీ భూమివర్జించి యా
     పున్నెంపుంగని అగ్బరేఁగె దివికిన్ బూర్ణేందుబింబంబు వా
     ర్ధి న్నిద్రింపగ బోయిన ట్లిఁక మహాంధీభూత మాలిన్య సం
     ఛన్మాస్మన్వినిపిద్ధజీవిత మభాసం బెన్ని నా ళ్ళుండినన్.

సీ. ఏమాట చెప్పిన నెదురాఁడగా లేదు
                పరమసాధ్వీత్వంబు వరలుకతన
    ప్రాణాల నర్పించి పరిచర్యలను జేసె
                పరమహర్షంబు ముందరను నిలువ
    కలిమిలేములను నొక్కటిగాఁగ గణియించె
                నిత్యకళ్యాణంబు నెలకొనంగ
    ఏవురు కొడుకుల నిద్దరు కూఁతుల
                ననిశంబు దీవించి నాత్మశాంతి

తే. ప్రతిదినంబు చదువు ఖురాన్న మాజు
    శౌచశీలాన నలువది వత్సరములు
    ధరణి జీవించి స్వర్గాన కరిగె అగ్బ
    రాంబ దివిజులు నీరాజనంబులిడఁగ.