పుట:2015.393685.Umar-Kayyam.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

ఉమర్ ఖయ్యామ్

83

మిత్రు లేరి ? జగాన నామైత్రి యేది ?
ప్రేమ యేది? యా మోమోట విధ మదేది?
దొంగ లెల్లరు; వారల సంగ మేల
దూరమున నుండియే నమస్కార మనుము.

84

చెలియా ! ద్రాక్షరసంబు నాకొసఁగుమా సీసాముఖద్వారమున్
వెలికిన్ దీయుము; దీనికన్న హితు లీవిశ్వంబులో లేరు; ని
ర్మలమై రాగరసంబుతో నెనయుచున్ రాగిల్లు నీ శీధుపా
త్రలతోఁ బోలెడు మానసంబుగల మిత్రవ్రాత మెందొండునే.

85

సౌందర్యము

ఆరమణీమనొహరముఖాబ్జము ముంగురు లుంగరాల సిం
గారముఁ బెట్టిదిద్దితి ; వికాసముగుల్కెడు ముద్దరాలిఁ గ
న్నారఁగఁ జూడరా దనెద వక్కట ! నిండిననీటిపాత్రమున్
బోరలువేసి నేలఁ బడఁబోవదు నీ రనునట్టు లుండదే.

86

ఏరును మాననేరని దదేపని మానుఁడు దేవునాజ్ఞ నా
ధారుణిఁ గ్రుంగు ; నీపగిది ద్వంద్వములన్ జన మార్తిజెందు ; నే
డేరగు నన్వభావములఁ దెల్పిన ? నిండిన నీటిపాత్రమున్
బోరలవేసి నేలఁ బడఁబోవదు నీ రనునట్టు లుండదే.