పుట:2015.393685.Umar-Kayyam.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

21

79

మదిరాపాదిత మత్తచిత్తతయె మా మార్గం బిఁకొం డేది మా
మదికిన్ నచ్చదు ; మమ్ము నిచ్చలును దుర్మార్గాళిగాఁ దిట్టుటల్
చదురే ? త్రాగెడువారు మత్తు లయి యశ్రాంతంబు తూగాఁడ కే
కుదురై యుందురె లోకమందు నిఁక సంకోచింపఁగ నేటికిన్.

80

ఆప్తులు లేరు

ఎవ్వని నీవు మిత్రునిగ నెంచకు ; దూరము దూర ముండియే
యివ్వసుధన్ జరింపు ; మదియే హితమై సుఖ మిచ్చు నీకు ; నీ
వెవ్వనియందు మైత్రి నిడి యెవ్వనిఁ బెన్నిధిగాఁగ నెంచెదో
నెవ్వగ నాతఁడే పరమనీచపుశత్రు వగున్ దలంచినన్.

81

జనసంఘం బను నగ్ని చేతను మహాజ్వాలావళీధూమ ద
ర్శనమే గాని ప్రయోజనంబు దలఁపన్ రవ్వంతయున్ గల్గదా
యెను ; గాలానికె కేలు మోడ్చి ఫలమెంతే దానియాచింతు ; మి
త్రునిగా నెంచినవానివల్ల ఫల మెందున్ దోఁచ దెన్నాళ్ళకున్.

82

గాడిదవంటి యాజనుల కైవస మేమిఫలంబుఁ గూర్చు ? నీ
తోడను నేల పాండితిని దోడ్కొనిపోయెదు ? వీరువిద్దెకున్
బోడిమికిన్ వెలే యొసఁగఁ బోవరు ; వత్సర మేడిపించి యే
నాఁడును జేరెఁ డంబువుల నైనను బోయరు దాహ మారఁగన్.