పుట:2015.393685.Umar-Kayyam.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

19

71

చక్రమును డాసి కుమ్మరి చట్టె లెన్నొ
చేయుచున్నాఁడు; భూపతిశిరము భిక్షు
కరమె యైనను మన్నె; యీపరమగుహ్య
మరసినాఁడఁ గులాలమందిరమునందు.

72

మదమున నేను బాపినయి మంజుల రంజిత కాచకుంభమున్
బదములఁదన్ని ఱాతిపయిబాదితి; న న్నది చూచి యిట్లనున్
"మొదటఁ ద్వదాకృతిన్ మనుజుఁ బోలినదాననె నేనుఁ నీవునున్
దుద కొకనాఁడు నావలెనెదొర్లి నశింతువు నిక్క మిద్ధరన్."

73

మానవ! మృత్తికన్ బిసుకమాను; ప్రయత్నము సేయవేమి వి
జ్ఞానమునకై ; కులాల కరచాలిత చక్రమునందు నా "ఫరీ
దూను" కరాంగుళంబులును దోరపు "కైఖొసురూ" శిరంబు మ
న్నైనఁ దదీయమృత్తికయె యాగతి ముద్దయి యున్న దచ్చటన్.

74

కుమ్మరి బెడ్డలన్ విఱి చి కుండలఁ జేయుచునుండఁ బెక్కు వ
ర్షమ్ములు చూచితిన్ బగలు రాత్రియు నాతనిచేతులందు ని
క్కమ్ముగఁ గ్రాలుమృత్తిక యొకానొకవీరునిదే; యతండు కన్
దమ్ములఁ జూడకున్నను యథావిధి నేఁ గనుచుంటి నీకథన్.