పుట:2015.393685.Umar-Kayyam.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

ఉమర్ ఖయ్యామ్

67

మరణము నీకు, నాకు నొక మాఱుగ వచ్చిన వచ్చు, దేహ పం
జరమును వీడి ప్రాణములు సాగిన సాగును ; నీవు నే నిలన్
నిరతము తృప్తులైనిలువ నేరము; సూర్యుఁడు చంద్రుఁ డెప్పుడున్
గిరణములన్ వెలార్చు మన కిల్బిషభూరజమం దజస్రమున్.

68

ప్రాణమేఁగినఁ గట్టెను బాతి గోరి
యొద్దకును వచ్చి పోవుచు నుంద్రు జనులు
కాని, భూమిలోనున్న నీమేనిపైని
జరిగెడు నుదంత మిసుమంత యెఱుఁగలేరు.

69

మనతనువులలోఁ బ్రాణము
చనునెడ భువిఁబాతి ఱాళ్ళుచఱచెద; రట న
న్యునకై యిటుకలు మన మ
ట్టిని జేతురు కాళ్ళఁ ద్రొక్కి డిందుపఱచుచున్.

70

అసువులు నేప్రమాదపథమందునొ పోవును; దేహపంక్తులన్
వసుమతిఁ బాతి పెట్టెదరు; పాపము పుణ్యము లేదు దానికిన్;
వెన జనులెందఱో నడచి వెళ్లెద రా మనబూదిఁద్రొక్కి; యే
వ్యసనములేక మృత్తికయి పండి తలంపము రెండులోకముల్.