పుట:2015.393685.Umar-Kayyam.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

17

63

అసఁ జషకంబుఁ బెదవులనంటి యాయు
వెంతొ యభివృద్ధిసేయఁగా నెంచ, నదియు
నిట్టు లనె ; నేను నీవలె నెపుడొ నరుఁడ
నన్ను సేవింపు మింకఁ గొన్నాళ్ళు నీవు.

64

కాకంబొక్కటి "తూసికోట" శిఖరాగ్రంబందుఁ గూర్చుండి యా
"కైకావూన" ను చక్రవర్తి తలముక్కల్‌సూచి యిట్లాడె ; 'నా
హా కాలంబ ! మదేభకుంభములపై నశ్రాంతమున్ మ్రోయు భే
రీ కల్పారవ మెందుఁ బోయె? నిపు డీఱేఁడెట్టులయ్యెన్ గటా !

65

అంబరచుంబితంబు, లమృతాభము లీధవళంబులైన సౌ
ధంబుల నేలు నేనృపుపదంబులపై భువనాధిపుల్ కిరీ
టంబులు మోపిమ్రొక్కిరొ ! కటా ! యతఁడేఁడనిపల్కుచున్ గపో
తంబు కుహూకుహూకలరుతంబులు సేయఁగ వింటి నే నటన్.

66

నిన్నఁ గులాలునింటను ననేక లసత్కలశంబు లూరకే
యున్నవి ; కొన్ని పల్కెడివి యున్నవి యవ్వి నిమిత్తవాక్కులన్
జెన్నుగఁ బృచ్ఛచేసె ; మముఁ జేసినవారును, విక్రయించువా.
రెన్నఁగఁ గొన్నవారల లెటకేఁగిరి ? చూవు మటంచు న న్నటన్.