పుట:2015.393685.Umar-Kayyam.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

9

32

లోకాలోక పరీత భూతలము నాలోకించి యా యీశ్వర
శ్రీకళ్యాణ కళాకలాపముల నీక్షింపంగఁ జర్చించి భూ
మ్యాకాశంబుల మెట్టి కాన కొగి భగ్నాశావకాశాత్ములై
మూకీభావము నొంది రేమనఁగ మోమున్‌జెల్ల కల్లాడుచున్.

33

గాలినై వాని చికురముల్ కదపలేను
వాని చింతాశ్వశృంఖలఁ బట్టలేను
వాని వీక్షింప నీకనుల్ పనికిరావు
పనికివచ్చినఁ జూడఁగా ననువుపడవు.

34

ఆ యీశ్వరుని రహస్యంబు ప్రశ్నోత్తర
            ములచేత నన్నెఁడుఁ దెలియఁబడదు
వెల లేని ధనమును వెచ్చించి సాధింప
            సాధ్యంబుగాదు నిస్సంశయంబు
బహువత్సరంబులు ప్రాణంబు లరికట్టి
            నెత్తురు తపసున నీరుఁజేసి
కష్టముల్ పడకుండఁ గాంచనేరవు బ్రహ్మ
            వస్తువు నా స్తికా భాసమందు
ఈ యమూల్యమౌరత్న మదేదొ గనిది
ఈ లసన్మౌక్తికపు విధమేదొ వేఱు
ఈ కళాభేదములు దోఁచు నీకు నాకె
ప్రియుల కథలలో మాటలే వేఱుకాదె.