పుట:2015.393685.Umar-Kayyam.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

ఉమర్ ఖయ్యామ్

28

సొంపులు నింపు పాత్రల విశుద్ధమతిన్ రచియించి వానినే
త్రెంపుట కెవ్వరిష్టపడి తెంపరులై చనుదేర రీశుఁడున్
సొంపులునింపు జీవులను శుద్ధమతిన్ సృజియించి యార్తిమై
జంపుట కేమిహేతువొ నిజంబు వచింపఁగరాదె నేర్చినన్.

29

మృతియను పెద్ద కాండపట మేరును దాఁటినవారు లేరు త
ద్గతి విధిచోదితం బయినకైవడి చెప్పెడువారు లేరు స
మ్మతిఁ దమబుద్ధికిన్ దెలియుమార్గములన్ వచియింత్రు గాని ని
శ్చిత మిదియంచుఁ దోఁపదు వచింప రచింప నసాధ్య మీకథల్.

30

ప్రకృతి తత్త్వజ్ఞు లాత్మధైర్యమను హయము
నాకసనంబునఁ బరువెత్త నంపినారు
ఆ పరాత్ముని రూపు వ్యోమాభమగుచుఁ
జుట్టియుండుట భ్రాంతులై సోలినారు.

31

కొందఱు బుద్ధిమంతులగు కోవిదు లర్ధపు మంచిముత్తెముల్
పొందుగ దండలల్లి యిడు పోలిక దేవునిగూర్చి చెప్పి మె
ప్పొందగలేక వాస్తవసమున్నతి యేదొ యెఱుంగలేకయే
మ్రందిరి వ్యర్థవాక్యము లనేకము లాడి ప్రగల్భచిత్తులై.