పుట:2015.393685.Umar-Kayyam.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

ఉమర్ ఖయ్యామ్

20

అక్కట వీఁగిపోవ నిఖిలార్థము లెందఱొ మిత్తిచేతిలోఁ
జిక్కి నశించినారు దివిఁజేరిన వారలలోన మచ్చుకై
యొక్కరు రారు వచ్చిన సదుక్తులఁ గోరమె వారి? 'మీరలున్
దక్కిన బాటసారుల విధం బెటులయ్యె' నటంచు వేడుకన్.

21

బహు బలిష్ఠ మహామూలబంధ కలిత
చండమార్తాండ మండల చలన ముదయ
మస్తమానములను గల యవధి యేమొ
తెలుప లే దూహయను త్రాసు కొలిచి తూచి.

22

ఈ నచరాచరావని వసించు జగం బొక చాయచిత్ర మా
భాసము మాయ దీని నిజభావ మెఱుంగనివాఁడు జ్ఞాన మన్
వాసనలేనివాఁడె; యిటువంటి యపోహలపొంతఁ బోక నీ
వాసవపాన మత్తమతివై విహరింపుము సంతసంబునన్.

23

మంటికి మింటిమధ్యగఁల మంజుల విద్యలనెల్ల నేర్చియే
యుంటిని మాయలన్ని యెఱిఁగుంటిని జిక్కులనుండి తప్పుకోఁ
గంటిని యడ్డులన్ని తొలఁగన్ నిలుచుంటినిగాని మిత్తి నే
వెంట జయింపలేనయితి విహ్వలచిత్తము సందడింపఁగన్.