పుట:2015.393685.Umar-Kayyam.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

3

8

నాకముజీవరాశి విడనాడి రయంబుగవచ్చి ధాత్రి మా
యాకృతి నాలు గైదులను నాఱిట నేడిట విభ్రమించి తీ
వేకడనుండి వచ్చితివొ యేకడ కేఁగెదొ చెప్ప లేవు నీ
కా కథలేల మద్యమును హాయిగఁద్రావుము నిత్యతోషివై.

9

ఉసురువిడిచి పైలోకాల ముసుఁగునందు
మాయమై పోయెదవు గాన మధువుఁద్రావి
కలదినంబు లానందానఁ గడుపు, మెచట
నుండివచ్చితొ యెట కేఁగనుంటి వొక్కొ.

10

పాఠాంతరములు :_
విను మును ప్రాణులుండిన పవిత్రతలంబును వీడి యోడి మే
దిని కరుదెంచి యీ తెరలు దీర్చిన యీశ్వరనాటకాన భ్రాం
తిని బడిపోయి తీ వెచటఁ దేలెదొ యేమిటియౌనొ యావలన్
గనుగొనలేవు గాన కలకాలము మద్యముఁ ద్రావి పుచ్చుమా.

11

ఆది నికేతనంబు విడనాడితివా పరమాప్తతత్త్వ వి
ద్యాదయితంబు నైన తెరకావలఁ బోయెద వంతెకాని నీ
వేది పరిత్యజించి యిట కేఁగితివో యిటనుండి యేదిశన్
బోదువొ నర వీ మధువు పొంతను హాయిగఁబుచ్చు కాలమున్