పుట:2015.393685.Umar-Kayyam.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తీసికొన్నను తత్త్వజ్ఞుఁడితని పద్యములందలి చమత్కారమును గ్రహించి యానందించునేగాని నాస్తికుఁడైన వామమార్గమందు బడిపోవడు.

ఇతడు మధువును గూర్చి చెప్పిన కొన్ని పద్యములు చూడుడు.

"ఈ సచరాచరావని వసించు జగంబొక చాయచిత్రమా
  భాసము మాయ దీని నిజభావ మెఱుంగనివాడు జ్ఞాన మన్
  వాసన లేనివాఁడె ; యిటువంటి యపోహల పొంతబోక నీ
  వాసవపాన మత్తమతివై విహరింపుము సంతసంబునన్. ప. 22

ప్రేమార్థప్రతిపాదితంబయిన మాహృత్పాత్రలో సీధు వెం
తే మర్యాద వహించు ; మత్తనగ రానేరాదు ; కర్మిష్ఠియున్
ధూమాగ్నిన్ సురయుంతపోసిన నభంబున్ ముట్టగామండు ; రెం
డే మార్గంబులు వహ్ని, నీటబడమాయించున్ బృథుజ్వాలలన్. ప. 77

ఈతడు నిర్వదించిన ప్రేయసి యెట్టిదియో చూడుడు :

"చెలి ! భవదాననంబు 'జమషీదు' సుధాకలశంబు మించె ; నీ
  తలఁపున జచ్చుటే సుధను ద్రావుటకంటెను మేలు ; నీపదం
  బులఁబడుధూళి నాదు దినముల్ వెలుగొందఁగజేయు ; దత్కళా
  కలితరజంబులో లవము కాంతిలు కోటిరవిప్రకాశమై" ప. 531

ఉమర్ ఖయ్యాం ప్రాపంచిక సుఖములను వేనోళ్ల పొగడినాడు ; కాని అతడు వాటిని మిక్కిలిగా నిరసించినాడు.

ప్రళయదినమున నీ నీలవదన మెఱిగి
వ్రేళ్లఁ గఱచెద వపవర్గ విభవమెల్ల
నైహికసుఖాల కమ్మితిని, "యుసూపు"
నపుడు పది దీనారములకు నమ్మినట్లు. 314