పుట:2015.393685.Umar-Kayyam.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

II

ఋషిసత్తముడైన ఉమర్ ఖయ్యామ్ తత్త్వమును ఫెడ్జిరాల్డు ఆంగ్లమున వ్రాసిన నూఱు రుబాయీలు చదివిన మాత్రమునఁ దెలియ నేరదు. ఇతని తత్త్వమును గ్రహింపవలయునన్న నితని యావద్గ్రంథము పూర్తిగాఁ జదువవలెను. ఇతడు నాస్తికవాది యని కొంద ఱభిప్రాయపడుచున్నారు. కాని యితఁడు అల్లాను, శ్రీ మహామ్మదువారిన అభివర్ణించు పెక్కు రుబాయీలను వ్రాసినాఁడు. వాటి నన్నిటిని శ్రీస్వామి గోవిందతీర్ధ (హైదరాబాదు) తన ఆంగ్లానువాద 'ఉమర్ ఖయ్యామ్‌' గ్రంథమునందు మొదట పేర్కొనినారు. ఉదా||

"He is, and nought but Him exists, I know,
 This truth is what creation's book will show,
 When heart acquird perception with His Light,
 Atheistic darkness changed it to faithly glow,"

మఱియు,

ఆయీశ్వరుని రహస్యంబుప్రశ్నోత్తరములచేత నెన్నఁడుదెలియఁబడదు
వెలలేనిధనమును వెచ్చించి సాధింప సాధ్యంబుగాదు నిస్సంశయంబు
బహువత్సరంబులు ప్రాణంబు లరికట్టి నెత్తురు తపసున నీరుఁజేసి
కష్టముల్ పడకుండఁ గాంచనేరవు బ్రహ్మ వస్తువు నాస్తికాభాసమందు.
                                                                        ప. 34

ఏను ప్రపంచ పాపములకెల్ల నిదానమునైన, నీదయా
స్థానము నన్ను బూతచరితాత్మునిఁ జేయునటంచు నమ్మెదన్
దీనుల నీవు ప్రోతువని తెల్పితివే యిఁక నింత కంటె నా
దీనత యేమి యున్నది? త్వదీయదయన్ గురిపింపు మీశ్వరా ! 300