పుట:2015.393685.Umar-Kayyam.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

157

618

వసుధ వెలార్చు వస్తువుల భాతిని నూర్ధ్వజగంబు లీశ్వరా
వసధము, స్వర్గమున్, నరక వర్గము లున్నవటంచు నెంచు మా
నసమును గాంచి నాగురువు నవ్వి త్వదాత్మను నిట్టి వెన్నియో
యెసఁగుచు నుండె నంచు వచియించెను నాతనితత్త్వవిద్యచేన్.

619

బింబాధరోష్టి నీ ప్రియతమ యొడిని నొ
           య్యార మొప్పఁగ వచ్చి కూరుచున్న
మధ్వాసవమునకు మాఱుగా నెదుటను
           నమృతభాండము నలరారుచున్న
యల యరుంధతియే స్వయంబుగా వసుధ కే
           తెంచి పాటలు వినిపించుచున్న
క్రీస్తు మున్నగు మహాఋషులు స్వస్తిప్రవ
           చనశతంబు పల్కి తనరుచున్నఁ

జిత్త మొకచోట లగ్నంబు సేయకున్న
సుస్థిరతవంక నెదఁద్రిప్పి చూడకున్న
సర్వ మాభాస మానందసాంద్రమైన
విభవ మబ్బునె యెట్టికోవిదునకైన.

620

నా యపకీర్తిభేరి యల నాకముదాఁకను మ్రోగిపోయె ; నా
ప్రాయము ముప్పదేఁడులకు బ్రాకె ; క్షణక్షణమంతొ యింతొ మై
రేయ మొగిన్ లభించిన సరే, కుతుకంబు జనింపకున్న ; దీ
యాయువె కాలగర్భమున నంతము నొంద నిఁ కేమి మోదముల్.