పుట:2015.393685.Umar-Kayyam.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

155

610

మతి విరహాగ్ని దగ్ధమయి మ్రంది, పరిభ్రమ నొంద నేఁ డిదే
వితత ప్రియాంగనా విపణి వీథుల మద్యము ద్రావుచున్ మదాం
ధతను నిజచ్ఛచేతను స్వతంత్రుడనై చెడి తొంట్రిప్రేమకే
మతిమరలించి యాకుహరమార్గమునన్ శరణంబుఁ జేసితిన్.

611

అతివిపరీతసంఘటన లందు ననున్ జెఱఁబట్టెఁ బ్రేమ ; నా
మతి చని "నేను వచ్చితి సుమా ! నడు" మంచును దాని నెట్టి, యు
ద్ధతిని బ్రియాగ్ని కింధన విధంబున మార్చి, తదింధనంబులన్
బీతి నిడి, యగ్నియై రవిలి చెచ్చఱ దర్దమొనర్చె సర్వమున్.

612

ప్రేమసురాపణం బనినఁ బ్రేమ ; ప్రియావన దీపమాలికా
స్తోమమునన్ బతంగతితి దూరి దహించుట యన్న ప్రేమ ; యా
ప్రేమసురాంబుధిన్ మునిఁగి ప్రేయసి సొంపగు మోమువంక నా
మోమును వంచి మ్రొక్కిసతమున్ స్మరియించుట ప్రేమగాకొగిన్.

613

ఆస్తికులెల్ల రీశ్వరయథార్థ విచారము సల్పుచుందు ; కా
నాస్తికు లెల్లఁ దార్కిక పదార్థ విషాదము నొందొచుందు ; నీ
స్వస్తిపథాలు రెండును నిజంబులు గావని వ్యోమవాజి వి
న్యస్తవిముక్త కంఠమున నచ్చెరువొంద వచించు విందరే.