పుట:2015.393685.Umar-Kayyam.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అని యెన్నియో జితేంద్రియత్వమును గూర్చిన మహా విజ్ఞాన విషయములను గూడ వ్రాసినాఁడు. ఈతడెప్పుడును ఆసవపానాది దుర్వివిషయములుగాని కామినీన్రక్చందనాది విషయలంపఁటుడుగాని కాఁడని చరిత్రజ్ఞులు వ్రాయుచున్నారు. ఔరంగజే బీతని గ్రంథమును, హాఫీజు (ఈత డొకసుప్రసిద్ధుఁడైన పారసీకవి) ప్రబంధమును, దేశస్థులెవరును చదువరాదని నిషేధించినాఁడు. జేబున్నిసా (ఔరంగజేబు కుమార్తె) ఈ గ్రంథముల నిరంతరము పారాయణము సేయుచుండెడిది. ఈవిషయమునుగూర్చి ప్రజలౌరంగజేబునడుగ మీరవి యర్థముచేసికొనఁగలిగితిరేని చదువవచ్చుననిచెప్పి పంపినాఁడు. దీనినిగూర్చి అగ్బరు చక్రవర్తి తన ఆయినీఅగ్బరి అను గ్రంథములో మిగుల ప్రశంసించి 'ఈ మహాగ్రంథములోని యుద్విషయము లనన్య సామాన్యములు ; ఎల్ల వారు గ్రహించుటకు సాధ్యముగావు' అని వ్రాసినాఁడు. మొత్తముపై నీ పొత్తము చదువుచున్నంతసేపు మనస్సునుచాలా నాకర్షించు చుండును. రసస్వరూప మెదుట దాండవమాడుచున్నదాయని తోఁచక మానదు. ఇట్టి పరివర్తన మింకొక గ్రంథమువలన రానేరదు.

[శ్రీఉమర్ అలీషా కవిగారు వ్రాసిన వ్యాసమునుండి - 'భారతి' ప్రభవనామ సం|| వైశాఖ మాసము]