పుట:2015.393685.Umar-Kayyam.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

ఉమర్ ఖయ్యామ్

606

ఏవొ రహస్యముల్ గలిగి యేర్చనిశీర్షము నుండఁబోదు ; వా
పోవఁగ హెచ్చుతగ్గులను బొందనిమానస ముండఁబోవ ; దే
త్రోవలొ తోఁచుఁ బాంధులకు దుర్లభమైనను, గాని ప్రేమకున్
ద్రోవయె తోఁచ దీ పథముఁ ద్రొక్కినధీరులు లేరు చూడఁగన్.

607

యూధులు, పారశీకులును, యోసులు, బౌద్ధమహమ్మదీయు లా
రాధనమందిరావళిని రౌరవభీతి విచంచలాత్ములై
గాధలఁద్రవ్వి స్వర్గమును గట్టఁ దపస్సులొనర్తు ; రీ మనో
వ్యాధుల డింద రీశ్వరరహస్య మెఱింగిన తత్త్వవేత్తలున్.

608

ప్రేమను నన్ సృజించె విధి సృష్టిదినంబునఁ బ్రేమపాఠమం
దేమరకుండ నేర్పి తుది నీహృదయంబును గోసి ముక్కలన్
బ్రేమరహస్యరత్నముల పేటికలన్ దెఱువంగ బీగపున్
స్తోమ మొనర్చె నా వితత శోభిత ప్రేమరసానుభూతికై.

609

అది మధువై యెసంగవలె నయ్యది కైకొన నర్హ పౌరుష
ప్రద విభవంబు గావలె నపారదయార్ద్ర వికంపితైక సద్
హృదయము గావలెన్ సతము ప్రేమచరిత్రము వల్లెవేయుచున్
గదిసి ప్రియాంగణంబులను గ్రాలెడుదూగరొ మన్నొ కావలెన్.