పుట:2015.393685.Umar-Kayyam.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

ఉమర్ ఖయ్యామ్

598

ఎఱుఁగవు నీవు ; నీ వెఱుఁగ నేనెఱిఁగించెద నాదినుండి యీ
నరుని యథార్థ మంతయు ; ననంత మహావ్యసనాగ్ని చే సదా
దురితభరానుషంగమగు తోరపురూప మొకండు చేసి యీ
ధరణికి దింపి కొంత వ్యవధానము నుంచియు నెత్తుకోఁబడెన్.

599

దరణి నభీష్టసిద్ధులనుదాల్చితి వంతమునందు నిల్చెనే ?
పరఁగ "ఉమర్‌ఖయాము" బహుభంగులఁ బాడితివైన నిల్చెనే ?
శరములునూఱులున్న, వరుసన్ మఱినూఱు శరంబులున్న భూ
భర మగుఁగాని, నాఁడయినఁ బాయకతీఱదు నిల్వనేర్తువే ?

600

ఇద్ధదయానురాగములు నెవ్వని మానసవీథియందు సం
సిద్ధి వహించు నాతఁడు "మసీదున" నున్న, గుడిన్ వసించినన్
శుద్ధుఁడె ; వేని పేరు పరిశోధనఁజేసిన ప్రేమసంహితన్
బద్ధగతిన్ లిఖింపఁబడువానికి లెక్కయె బఁధమోక్షముల్ ?

601

నే నలప్రేమకాఫరుఁడ నిక్కము ; సోయగమొప్ఫు నా "ముసల్
మానుఁడు" వేఱు ; వృద్ధపరమాణుపిపీలిక నేను ; "ఆ సులే
మానుఁడు" వేఱు ; శోభచెడి మాడినమానస మొండె మాకు ; సా
మానులు, దంభశాటికలు మార్చెడునంగడి వేఱు చూడఁగన్.