పుట:2015.393685.Umar-Kayyam.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

151

594

కాలము పెక్కుజీవన నికాయపటంబులఁ గుట్టుచున్న ; దీ
కాలము పెక్కుజీవన నికాయపటంబులఁ జింపుచున్న ; దీ
కాలము పెక్కుమానవనికాయము లప్పులవల్లఁ జేయు ; నీ
కాలము వాని బూడిదను గల్పుచు నున్నది యెల్ల వేళలన్.

595

అక్కట ! మేము పాడయితి మాకసమన్న ఘరట్ట మంతయున్
నొక్కుచుఁ బిండి చేసినది నోరిటు నొవ్వఁగ మోదుకొం చొగిన్
బొక్కుటకంటె మార్గమిఁకఁ బోలదు ; చెల్ల రె ! ఱెప్పపాటులోఁ
జిక్కి నశించినాము ఫలసిద్ధియొకింతయుఁ జూడకుండగన్.

596

బాల్యమునందు నొజ్జలను బట్టీతి నధ్యయనార్ధ ; మంత నా
బాల్యము పోవ నొజ్జనయి పాఠముఁ జెప్పితిఁ బెద్దకాలమున్
నైల్యము దోఁప నాతెఱఁగు నాఁటికి నేఁడు విభూతిఁ బుట్టు సౌ
శీల్యము వీడి బూడిదయి చెన్నఱి గాలికిఁ దూలితిన్ గటా !

597

చూతితి భూమిపై నిదుర సొంపుగఁ బోయెడువారిఁ గొందఱన్ ;
జూచితి భూమిలో నిదుర సొంపుగఁ బోయెడివారి కంటికిన్
గోచరమైనఁ గాని మరు కుడ్యము ; లెస్సగఁ జూడ నెందఱో
తోఁచిరి ; వారు వచ్చి యిటఁ దొట్రిలి క్రమ్మఱఁ బోయి రాఁగ కే.