పుట:2015.393685.Umar-Kayyam.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

ఉమర్ ఖయ్యామ్

590

శతమొ, సహస్రవర్షములొ చావక యుండిన నుండవచ్చు ; నీ
క్షితిని, బురాతనంబయిన క్షేత్రముఁ బాయకతీఱదెప్పుడో
క్షితిపతి యైన, జానపద సీమల యాచకుఁ డైన నొక్కటే
మృతి యొకరీతిగాఁ గలిసి మ్రింగును గాలము మూడివచ్చినన్.

591

నీవు నొకప్పు డన్నమును, నీరును, నిద్రయుఁ గోరకుంటి ; వా
హా ! విధి పంచభూతముల యందిడి నిన్నొక కట్టగట్టె ; న
య్యో ! వెస వీని నన్నిటి నొకొక్కటె గైకొను ; మీవు పూర్వమే
భావముతోడ నుంటి వలభావమె వచ్చు విధాయకంబుగన్.

592

మానవుఁ డొక్కసొంపయిన మంజులసత్కలశంబు ; దీనిపై
మానస మెంతొ ప్రేమనిడి మాటికి ముద్దులు పెట్టు ; నిట్టి సొం
పైన ఘటంబు చేసి పొలుపారినకాలకులాలుఁ డుర్విపైఁ
బూనిక మోది మోది తుదిముక్కలఁ జేసియె పాఱవేసెడున్.

593

యౌవనసత్వసంప దుదయంబగు కాలము రూపుమాసె ; నా
జీవన మెల్లఁ దిక్తమయి చీఁకపోయె ; శరంబువంటి మే
నీ విధిగా ధనుస్సువలె నెంతయు వంగెను : గఱ్ఱచేతనే
లేవఁగ నయ్యె : నిల్వఁబడ లేను :నసహ్యత నీడ్తుఁ గాయమున్.