పుట:2015.393685.Umar-Kayyam.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

147

578

ఈవ యెఱుంగవే ధరణి నేమి స్వలాభము వచ్చెనాకు ! లే ;
దీవ యెఱుంగు దే బ్రతికి యీ యొడి నింపిన దేది ? ధిప మ
ట్లీవిధి వెల్గుచున్న, నెపు డేనియు నాఱిననేమి లేదు ; "జం
భూవరుపాత్ర" నే పగిల పోయిన నేమియు లేదు చూడఁగన్.

579

ఎందఱో వచ్చి రెందఱో యేఁగినారు
పూర్వులు, నపూర్వులును యత్న పూర్వకముగా :
నొక్కొకరు కృతార్థు లగుదు ; రుర్వి కడుఁ గృ
తఘ్న యెవరితో నిల్వ ; దెందఱు జగాన
వచ్చి వెళ్లిరి ; వెళ్ళఁగా వత్తు రింక ?

580

ధరణి జనించి యెందఱొ ముదంబున నాడుచుఁ బాడుచున్ మనో
హర మగుభక్ష్యభోజ్యతతి హాయిగ మెక్కి, యొకొక్కగుక్కెఁడు
క్షురసము ద్రావి మూర్ఛిలిరి ; శూన్యసుషుప్తివదూటి వారి నం
దఱ నొకచోటఁ జేర్చి ప్రమదంబున నిద్గురఁబుచ్చె నెంతయున్.

581

ముసలితన మూహలను, బుద్ధి మోసగించే
మన్మనోహరసుమకాంతి మాపివేసె
దేహగేహభిత్తికలపైఁ దీర్చినట్టి
కప్పు శిథిలమై పోయెను ముప్పు గదుర.