పుట:2015.393685.Umar-Kayyam.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

129

506

నీయధరంబునం దమృతనర్ఘరి యేర్పడ దాఁగియున్న దో
గాయని ! దాని నంటఁ జషకంబిడ కాసుధఁ బీల్చివైచు ; నో
హో ! యిదియెంతప్రోడ ! తనయోష్ఠమునన్ జెలియోష్ఠమానగాఁ
బోయెను ! దీనిరక్తమును మ్రుచ్చిలకుండినఁ బూరుషుండనే ?

507

చూచెద వింక నేఁడు చెలి, చూడ్కులతో నను గాఢవిస్మృతున్
జూచెద వింక నీకురులసొంపును పూజ నొనర్చు నంబినిన్
జూచెద వింకఁ దచ్చషకశూన్యకరాబ్జుఁ గిరీటహీనునిన్
జూచెద వింక నీచరణచుంబితఫాలు, ధరావలీఢునిన్.

508

అలరాకాశశి డిందఁజేయును ద్వదాస్యాబ్జంబు ; పర్వంబులం
దలరుంబోఁడు లలంకరించుకొని యొయ్యారంబుగా నుంద్రు ; నీ
వల పర్వంబు లలంకరింపఁగల వొయ్యారంబు లొప్పార ; నీ
యిల నెవ్వాఁడు సృజించెనో చెలిమి నిన్నే ణాక్షి వీక్షింపఁగన్.

509

కరుణ యెన్నాళ్ళకైనను గలుగదాయె
నబల ! స్మరియింపవు పరాకు నైనఁగాని
యింక నీదయ రాదని కొంక కరులు
నన్ను నిందింతు రని యెంతు ఖిన్నమతిని.