పుట:2015.393685.Umar-Kayyam.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

ఉమర్ ఖయ్యామ్

486

రోమకులు ప్రళయము దెచ్చు రూపమరయ
ముంగురులు నీదువదనంబు మూసె నదిగొ
అబ్జనేత్రాలు వెలయు సింహాసనమున
మత్తను ఖలుండు వచ్చె సామ్రాజ్యమునకు.

487

మనము వసించెడి యీ జగ
మునఁ జూచితిఁ గాని నీదు మొగమునకును బో
లునె చంద్రుఁడు ? నీ తీరున
కును బోలునె "సరువు" తరువు కోమలగాత్రీ !

488

పడతి ! త్వదీయనార్తసు బ్రభాతసుధాపవనంబు దెచ్చి నా
కడకు ; మదీయమానసముఁ గైకొనిపోయెను నీకొసంగ ; ని
ప్పు డది దలంప నన్ మఱచిపోయెను నీ సహవాస వాసనం
బడి సహచర్య మూరకయె పాయదుగా యెటువంటివారికిన్.

489

నీచెక్కిళులు సుమంబుల
దోఁచుకొనున్ ; నీదుసొగసుతోఁ బొల్తురె చీ
నా చెలువలు ; చూపుల
తో చతురంగము విధానఁ దూఁగదె జగమున్.