పుట:2015.393685.Umar-Kayyam.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

117

458

మధువుచేఁ జరితార్థతమాకుఁ గలదు
మధుకలశ మెప్డు మాతోడ మాటలాడు
నందుచేఁత ద్రావెద మడుగడుగునకును
మధువుచే మేము, మాచేత మధువుఁగలదు.

459

ఇంతనరాని యీమధువు నేకడుఁ ద్రావెద ; దానిచేతఁ బ్రా
ణాంతకమై, సమాధి నిడినప్పుడుగూడఁ దదీయమృత్తికన్
వింతగ మద్యవాసనయె వీవవలెన్ సురఁ ద్రావువార లా
ప్రాంతముఁ జేరిరేని నలవాసన మైకముఁ గూర్చుఁ గావుతన్.

460

సురఁ నిషేధమె యైన భాసురమృదంగ
తాళములు మ్రోయఁ ద్రావు మేవేళఁగూడ
మధురమధురసమే చిక్కుమార్గ మున్నఁ
ద్రావు మొకచుక్కయును నేల రాలకుంకు.

461

ఏను సుర ద్రావకుండ జీవింపలేను,
మేను భరియింపలేను, నామించుబోఁడి
వచ్చి సుర దెచ్చి యిచ్ఛిన వలదటంచు
నాడ మైకములోనున్ననాఁడ నబల !