పుట:2015.393685.Umar-Kayyam.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

ఉమర్ ఖయ్యామ్

454

సుర - దారిద్ర్యము

మట్టిబొమ్మలఁ జేసి యీమాడ్కి మమ్ము
దుఃఖదారిద్ర్యకుహరాలఁ ద్రోసి వేసె ;
మమ్ముఁ బేదఱికమె సురన్ మాన్పుచుండ
నింక సుర మాను మని ప్రభోధింప నేల ?

455

ఒకతృణమైన నా కడను నుండిన, దానిని విక్రయించి త
ప్పక సురఁ గొందు ; "ఱేపు మధుపానముచేయగ డబ్బులేదే, నీ
విఁక నొనరింతు వే" మనుచు నీప్రజ నింద యొనర్పకుండఁగా
నిఁక నల "ఏసుతల్లి" వడికిచ్చిన నూలుకుళాయి నమ్మెదన్.

456

తెలివిచేతనె భాగ్యంబు గలుగబోదు
పేదవానికి బంది పృథ్వియువనంబు
పేద "బెనఫషా" కుసుమము ఖేదపడును
నవ్వును గులాభిలోన స్వర్ణంబుకతన.

457

పురుషుఁడు ప్రయోజకుఁడు, కళాపూర్ణుఁ డిద్ధ
వంశసంజనితుండు గావలయు నండ్రు
కాని, యివి యెల్లఁ బొల్లు లీకాలమందు
గనక ముండినఁ జాలు సంకరము లేదు.